DRDO S 400: ఒకప్పుడు ఆయుధాలు కావాలంటే అమెరికా వద్దకు వెళ్లాలి. అమెరికా ఇవ్వను అంటే రష్యా శరణు జొచ్చాలి. రష్యా ఇవ్వకపోతే ఇజ్రాయిల్ మీద ఆధారపడాలి. ఇజ్రాయిల్ కుదరదని చెబితే ఫ్రాన్స్ తలుపు తట్టాలి. ఇదంతా కూడా ఒక ప్రహసనం. పైగా విపరీతమైన ఖర్చు. దీనికి తోడు ఆ ఆయుధాలలో మన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడానికి అవకాశం లేదు. అన్ని అంశాలలో కూడా ఆ దేశాల మీద ఆధారపడాల్సిందే. దీనివల్ల రక్షణ రంగా వ్యయం తడిసి మోపెడయ్యేది. అయితే ఇప్పుడు ఇండియా ఒకప్పటిలాగా మోకరిల్లే పరిస్థితి లేదు. తలవంచే పరిస్థితి లేదు. పైగా ఆయుధాలను సొంతంగా తయారు చేయడం మాత్రమే కాదు.. ఇతర దేశాలకు అమ్మే స్థాయికి భారత్ ఎదిగింది. ఆపరేషన్ సిందూర్ మన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి సరికొత్తగా చూపించింది. ఇక్కడితోనే మన డిఆర్డిఓ ఆగలేదు. అంతకుమించి అనే రేంజ్ లో ప్రయోగాలు చేస్తోంది. ఫలితాలు సాధిస్తాంది.
Also Read: ఫైరింగ్ పూర్తి అయ్యింది..’ఓజీ’ నుండి అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్!
ఆకాష్ ను సరికొత్తగా రూపొందించి ఇటీవల డిఆర్డిఓ సంచలనం సృష్టించింది. అంతేకాదు ఫిరంగులను కూడా రూపొందించింది. వీటిని బ్రెజిల్ దేశానికి విక్రయించడానికి ఒప్పందాలు కూడా కుదురుచుకుంది. ఆకాష్, ఫిరంగులు మాత్రమే కాదు ఇప్పుడు డి ఆర్ డి ఓ మరో క్షిపణి వ్యవస్థను రూపొందించింది. దానికి అస్త్ర అనే పేరు పెట్టింది. కాకపోతే ఇది పనిచేసే విధానమే అద్భుతం. పూర్తిగా స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ తో బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ ఇది పనిచేస్తుంది. దీనిని ప్రయోగించడానికి డిఆర్డిఓ పరీక్షలు చేసింది. అ పరీక్షలు విజయవంతమయ్యాయి. భారత వైమానిక దళంతో కలిసి ఒడిశా తీర ప్రాంతంలో అస్త్ర మిస్సైల్ పరీక్షలనునిర్వహించగా విజయవంతమయ్యాయి..
హై స్పీడ్ మానవ రహిత వైమానిక లక్ష్యాలపై రెండు ప్రయోగాలను డిఆర్డిఓ చేపట్టింది. రెండు ప్రయోగాలలో కూడా మిస్సైల్స్ పిన్ పాయింట్ కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేశాయి. దీంతో భారత సైన్యానికి మరో అస్త్రం దొరికినట్టయింది. ఇప్పటికే ఎస్ -400 ద్వారా మన గగనతలం శత్రు రహితంగా మారింది. ముఖ్యంగా ఎస్ 400 ద్వారా దాయాది మిసైల్స్ మన భూభాగంలోకి ప్రవేశించలేకపోయాయి. అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. పైగా వాటి దారిని కూడా మళ్లించింది. ఒక రకంగా వాటి కళ్ళు కప్పింది. రాడార్ వ్యవస్థను కూడా దారి మళ్లించింది అంటే ఎస్ 400 ఎలా పని చేసిందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ఎస్ 400 మనకు రష్యా ఇచ్చినప్పటికీ.. దానికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంలో మన రక్షణ రంగ నిపుణులు విజయవంతమయ్యారు. అందువల్లే అది గగనతలంలో రక్షణ కోటలాగా అవతరించింది. ఇప్పుడు దీనికి అస్త్ర తోడు కావడంతో భారత్ కు తిరుగులేకుండా పోయింది. అయితే ఇందులో కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడానికి డీ ఆర్ డీ వో అడుగులు వేస్తోంది.