Ram Charan Upasana Twins: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(Upasana Konidela) సతీమణి మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈసారి ఒక కవలపిల్లలకు జన్మనిచ్చింది ఉపాసన. ఒక పాప, ఒక బాబు పుట్టినట్టు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘పట్టరాని సంతోషం తో మేము మీ ముందు ఈ శుభవార్తని పంచుకోవాలని అనుకుంటున్నాము. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఒక పాప, ఒక బాబు. ఇద్దరు బిడ్డలు, తల్లి క్షేమంగా ఉన్నారు. ఈ చిన్నారులను మా కుటుంబం లోకి మనస్ఫూర్తిగా ఆనందోత్సాహాలతో ఆహ్వానిస్తున్నాము. గ్రాండ్ పేరెంట్స్ గా ఆ చిన్నారులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. ఇలాంటి సమయం లో బిడ్డలా క్షేమాన్ని కోరుకున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఆయన వేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
రామ్ చరణ్ కి సంతానం కలగాలని అభిమానులు ఎప్పటి నుండో ప్రార్థనలు చేస్తూ వచ్చారు. వాళ్ళ ప్రార్థనలకు ఆ దేవుడి ఆశీర్వాదం తోడై, 12 ఏళ్ళ తర్వాత ఈ దంపతులు క్లిన్ కారా కి జన్మనిచ్చారు. మొదటిసారి సంతానం కలిగినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఎంత సంతోషించారో, కోట్లాది మంది మెగా అభిమానులు కూడా అంతలా సంతోషించారు. అంతా బాగానే ఉంది కానీ, రామ్ చరణ్ కి ఒక కొడుకు కూడా పుడితే బాగుండును అని అంతా కోరుకున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టే ఒక బాబు, ఒక పాప పుట్టారు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ బాణసంచాలు కాలుస్తున్నారూ. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు vaarthane కనిపిస్తోంది.
గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’ చిత్రం సంచలన విజయం సాధించింది. అక్కడి నుండి మెగా ఫ్యామిలీ కి మహర్దశ పట్టుకుంది. అభిమానులు అయితే చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీ ఉత్సవాలను చూస్తున్నారు. ‘ఓజీ’ తర్వాత ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదల అయ్యి భారీ హిట్ అవ్వడం, అదే నెలలో రామ్ చరణ్ దంపతులు కవలపిల్లలకు జన్మనివ్వడం ఇలా వరుసగా అబ్దుతమైన ఆనంద క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక రాబోయే రోజులు కూడా అన్నీ మంచిగానే ఉంటాయని, మెగా ఫ్యామిలీ టైం స్టార్ట్ అయ్యింది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins – a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026