Gold Fraud: ప్రపంచంలో అన్నిటికంటే భారత్లో బంగారం లోహానికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ బంగారం ను ఆడవాళ్లు విరివిగా వాడుతూ ఉంటారు. చేతికి ఉంగరం నుంచి మెడలో హారం లాంటి ఏడు వారాల నగలు కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. 10 గ్రాముల ధర కనీసం లక్ష రూపాయల వరకు పలుకుతుంది. అయితే బంగారం ధర ఎంత ఉన్నా.. కొన్ని విషయాల్లో తప్పక కొనుగోలు చేయాల్సి వస్తుంది. శుభకార్యాలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం కొనక తప్పదు. అయితే ఇలాంటి సమయంలో బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు కొందరు షాపు వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. ఇలా మోసపోకుండా ఉండాలంటే బంగారం కొనుగోలు గురించి పూర్తిగా తెలియాలి. ముఖ్యంగా బంగారం కొనేముందు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అదేంటంటే?
Also Read: బిసిసిఐ అగ్గి మీద గుగ్గిలం.. ఇకపై ఉప్పల్ లో క్రికెట్ మ్యాచ్ లు జరగడం కష్టమే.. ఎందుకంటే?
ఒక జువెలరీ షాపుకు వెళ్లి ఒక ఆభరణం కొనాలని అనుకుంటారు. కానీ ఆభరణం ధర ఎంతో తెలుసుకోవాలని ఉంటుంది. అయితే షాపు వాళ్లు చెప్పే ఒక ధర నిజమా? కాదా? అనేది మనకు తెలియదు. కానీ షాపులో ఉండే ఆపరణం పై కొన్ని నెంబర్లు ఉంటాయి. మరి ఆభరణం ధర ఏంటో తెలుసుకోవాలంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేయాలి. ఉదాహరణకు బంగారం ధర మార్కెట్లో రూ. 80,000 ఉందని అనుకుందాం. కానీ కొనే ఆభరణం ఎంతకు వస్తుందో తెలియదు. ఇలాంటి అప్పుడు మొత్తం బంగారం ధర ను 999 తో భాగించాలి. ఈ వచ్చిన మొత్తాన్ని ఆభరణం పై ఉన్న నెంబర్ తో గుణించాలి. ఉదాహరణకు ఆభరణం పై 916 అనే నెంబర్ ఉంటే దానితో కొనిచాలి.
80,000÷999×916=73,350
పై విధంగా ఆభరణం ధరను లెక్కించుకోవచ్చు. అంటే ఆభరణం ద్వారా 73,350 ధర అని అనుకోవాలి. ఈ ధరను షాపు వాళ్లు చెబితే ఓకే.. కానీ ఇంతకుమించి ఎక్కువ చెప్తే మాత్రం అడగవచ్చు. అలాగే బంగారం కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో బంగారం నాకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నకిలీది విక్రయించే అవకాశం ఉంది. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలోనే క్వాలిటీ దేనా లేదా అనేది గుర్తించుకోవాలి. అంతేకాకుండా బ్రాండెడ్ ఉన్న షాపుల్లోనే బంగారం కొనుగోలు చేయాలి. సాధారణ షాపుల్లో గోల్డ్ కొనుగోలు చేసినా.. జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుతం బంగారం రోజురోజుకు ధర పెరుగుతోంది. ఇటీవల కొన్ని రోజులపాటు తగ్గుముఖం పట్టింది. అయితే ప్రస్తుతం ఆషాడం మాసం కావడంతో బంగారం కొనుగోలు తక్కువగా అయ్యాయి. శ్రావణమాసం ప్రారంభమైతే బంగారం కొనుగోలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ శ్రావణంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించాలని అనుకుంటే ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.