Homeఎంటర్టైన్మెంట్Dhurandhar Views On Netflix: నెట్ ఫ్లిక్స్ లో 'ధురంధర్' ప్రభంజనం..24 గంటల్లో వచ్చిన వ్యూస్...

Dhurandhar Views On Netflix: నెట్ ఫ్లిక్స్ లో ‘ధురంధర్’ ప్రభంజనం..24 గంటల్లో వచ్చిన వ్యూస్ ఎంతంటే!

Dhurandhar Views On Netflix: థియేటర్స్ లో సంచలనాత్మక విజయాన్ని నమోదు చేసుకున్న ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం కోసం, ఓటీటీ ఆడియన్స్ ఎన్నడూ, ఏ సినిమాకు చూడనంత ఆతృతగా ఎదురు చూసారు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్స్ లో కేవలం హిందీ లో మాత్రమే విడుదలైంది. మంచి సినిమాలు ఎక్కడున్నా ఆదరించడానికి సిద్ధంగా ఉండే మన తెలుగు ఆడియన్స్, ఈ సినిమాని తెలుగు వెర్షన్ లో విడుదల చేయనందుకు చాలా ఫీల్ అయ్యారు. మన తెలుగు ఆడియన్స్ […]

Dhurandhar Views On Netflix: థియేటర్స్ లో సంచలనాత్మక విజయాన్ని నమోదు చేసుకున్న ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం కోసం, ఓటీటీ ఆడియన్స్ ఎన్నడూ, ఏ సినిమాకు చూడనంత ఆతృతగా ఎదురు చూసారు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్స్ లో కేవలం హిందీ లో మాత్రమే విడుదలైంది. మంచి సినిమాలు ఎక్కడున్నా ఆదరించడానికి సిద్ధంగా ఉండే మన తెలుగు ఆడియన్స్, ఈ సినిమాని తెలుగు వెర్షన్ లో విడుదల చేయనందుకు చాలా ఫీల్ అయ్యారు. మన తెలుగు ఆడియన్స్ తో పాటు అన్ని భాషల్లోని మూవీ లవర్స్ ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. చివరికి నిన్న నెట్ ఫ్లిక్స్(Netflix) లో ఈ చిత్రం విడుదలైంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమా సన్నివేశాలే కనిపిస్తున్నాయి. ఎంత అద్భుతంగా తెరకెక్కించారో అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు ఆడియన్స్. ఇది కదా అసలు సినిమా అంటే అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసిన 24 గంటలకు దాదాపుగా రెండు మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకు అయినా నెట్ ఫ్లిక్స్ లో రెండు మిలియన్ వ్యూస్ రావడానికి ఒక వారం, లేదా 5 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ చిత్రానికి కేవలం 24 గంటల్లోనే వచ్చింది. అంటే దీని లాంగ్ రన్ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. మన ఇండియన్ మూవీస్ జాబితాలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రం #RRR. దాదాపుగా 45 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి ఈ చిత్రానికి. ఇదొక శాశ్వత రికార్డు గా మిగిలిపోతాది, భవిష్యత్తులో దీనిని కొట్టే సినిమా రావడం కష్టం అని విశ్లేషకులు సైతం అనేవారు.

కానీ ధురంధర్ ఊపు చూస్తుంటే కేవలం రెండు నెలల్లోనే ఈ చిత్రం #RRR వ్యూస్ ని దాటేలా ఉంది. అన్ని భాషలకు సంబంధించిన ఆడియన్స్ ఓటీటీ లో ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు కాబట్టి, మార్చి 19 న రాబోయే ‘ధురంధర్ 2’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పక్క భాషకు సంబంధించిన సినిమాలు ఈమధ్య కాలం లో భారీ హైప్ తో వచ్చిన చిత్రం ‘KGF చాప్టర్ 2’. ధురంధర్ సీక్వెల్ ఆ సినిమా రేంజ్ హైప్ తోనే వస్తుందని అంతా అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా హవా ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper