Homeఆంధ్రప్రదేశ్‌Attack on YSRCP Leader: కారులో ఆమె.. వైసిపి నేతను చెప్పుతో కొట్టిన భర్త.. వీడియో...

Attack on YSRCP Leader: కారులో ఆమె.. వైసిపి నేతను చెప్పుతో కొట్టిన భర్త.. వీడియో వైరల్

Attack on YSRCP Leader: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో నేతల వ్యక్తిగత వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రైవేటు వీడియోలు బయటకు వస్తున్న క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాటిని ట్రోల్ చేస్తోంది. ఇటువంటి క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అనుచరుడి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ మహిళను తన కారులో వైసీపీ నేత తీసుకెళ్తుండగా భర్త అడ్డగించారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ […]

Attack on YSRCP Leader: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో నేతల వ్యక్తిగత వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రైవేటు వీడియోలు బయటకు వస్తున్న క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాటిని ట్రోల్ చేస్తోంది. ఇటువంటి క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అనుచరుడి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ మహిళను తన కారులో వైసీపీ నేత తీసుకెళ్తుండగా భర్త అడ్డగించారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళను కొట్టి.. వైసీపీ నేతను జోడుతో కొట్టారు. అక్కడ నుంచి తన భార్యను తీసుకెళ్లారు.. అయితే సదరు వైసీపీ నేత ఓ సీనియర్ నాయకుడు అనుచరుడు. బాధిత వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ గా తెలుస్తోంది. ఇందుకు వివాహేతర సంబంధమే కారణమని ప్రచారం నడుస్తోంది.

* ప్రధాన నేత అనుచరుడు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా హరిప్రసాద్ రెడ్డి అనే నేత పనిచేస్తున్నారు. ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత అనుచరుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద ఆయన ఓ మహిళతో కారులో వెళుతుండగా కొంతమంది అడ్డగించారు. ఆ కారులో ఉన్న మహిళ భర్తతోపాటు మరికొంతమంది అడ్డగించే ప్రయత్నం చేశారు. కారు దిగిన వెంటనే ఆ మహిళపై భర్త దాడికి పాల్పడ్డారు. ఆమెను తీసుకెళుతున్న వైసీపీ నేతను చెప్పుతో కొట్టారు. సదరు మహిళతో హరి ప్రసాద్ రెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

* వివాహేతర సంబంధం తోనే..
మరోవైపు దాడి చేసిన వ్యక్తి వైసీపీ స్థానిక నేత అని తెలుస్తోంది. ఆయన ఓ గ్రామానికి సర్పంచ్ కూడా అని స్థానికులు చెబుతున్నారు. దాడి అనంతరం హరిప్రసాద్ రెడ్డి కారును ధ్వంసం చేసి.. ఆ మహిళను తనతో పాటు భర్త తీసుకెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దాడి పై ఇప్పటివరకు హరిప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఆ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తోంది. ఇప్పుడు జనసేనకు ఇదో అస్త్రంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper