Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గుర్తింపు అయితే ఉంది. ఆయన ఒక స్టోరీని సెలెక్ట్ చేశాడు అంటే ఆ కథలో ఎంతో కొంత వైవిధ్యమైతే ఉంటుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మొదట్లో చిరంజీవి తన సినిమాల సెలెక్షన్లలోనే కాకుండా పవన్ కళ్యాణ్ కోసం కొన్ని కథలను సెలెక్ట్ చేసి మరి సినిమాలుగా చేయించేవాడు. ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా విషయంలో చిరంజీవి వద్దని వారించారట. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ సినిమాను చేశాడు. మరి ఫలితం ఏమైంది అనే విషయం పక్కన పెడితే కథల విషయం లో చిరంజీవి జడ్జిమెంట్ చాలా వరకు కరెక్ట్ గా ఉంటుంది. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే అది ఆల్మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టోరీ అనే చెప్పాలి. ఎక్కడో ఒకచోట చిన్న లోపం జరిగితే తప్ప ఆ సినిమాలు ఫ్లాప్ అయితే అవ్వవు. అందువల్లే ఆయన బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తూ మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక స్టోరీస్ సెలక్షన్ విషయంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా అనేంతల గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ చేసిన ‘గుడుంబా శంకర్’ సినిమా కథను మొదట చిరంజీవి విన్నారట.
అయితే ఆ కథ చిరంజీవికి పెద్దగా ఎంగేజింగ్ గా అనిపించకపోవడంతో ఆ సినిమాను వదిలేయమని పవన్ కళ్యాణ్ కి చెప్పారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దర్శకుడు వీరా శంకర్ కి సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి అతని మాటని వెనక్కి తీసుకోలేక ఆ సినిమాను చేశాడు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ రేంజ్ కి సరిపడా కథ కాదనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ప్రేక్షకుడు రిజెక్ట్ చేశాడు.
ఫలితంగా ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ వరుసగా ఫ్లాప్ ల పరంపరను కొనసాగిస్తూ వచ్చాడు. ఇక ఎప్పుడైతే గబ్బర్ సింగ్ సినిమా వచ్చిందో అప్పుడు భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి జడ్జిమెంట్ లో చాలా వరకు జన్యునిటీ ఉంటుందని ఈ సినిమా ద్వారా మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక మొత్తానికైతే ఈ ఏజ్ లో కూడా చిరంజీవి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతుండడం ఈ సినిమా మీద అంచనాలను పెంచుతుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More