Pawan Kalyan And Prabhas: ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, ప్రభాస్ కనిపించబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ప్రభాస్(Rebel Star Prabhas), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లను సోషల్ మీడియా లో, అలాగే బయట సమానంగా ఇష్టపడే అభిమానులు ఉంటారు. వాళ్ళు ఈ వార్త విన్నప్పటి నుండి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అప్పట్లో ప్రభాస్ హీరో గా నటించిన ‘వర్షం’ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అదే వీళ్లిద్దరు కలిసి పంచుకున్న చివరి వేదిక. ఆ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలుసుకున్నాడు కృష్ణం రాజు గారు చనిపోయిన రోజునే. మళ్ళీ వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒకే వేదికని పంచుకోలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత వీళ్లిద్దరు కలిసి మంచు విష్ణు(Manchu Vishnu) ‘కన్నప్ప'(Kannappa Movie) సినిమా కోసం కలవబోతున్నారు.
Also Read: బైక్ గిఫ్ట్ గా ఇస్తా… హీరో కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్, ఇలా చేస్తే చాలు, అది మీ సొంతం!
ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ‘రుద్ర’ అనే కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చివర్లో ప్రభాస్ కనిపించి అభిమానులకు ఊహించని సర్పైజ్ ని అందించిన సంగతి తెలిసిందే. ఆయన లుక్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ప్రభాస్ తో పాటు ఈ చిత్రం లో అక్షయ్ కుమార్, మోహన్ బాబు,మోహన్ లాల్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మెగా ఫ్యామిలీ తో మోహన్ బాబు కి కాస్త విబేధాలు ఏర్పడ్డాయి అనే విషయం కాసేపు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ తో మాత్రం మొదటి నుండి మోహన్ బాబు కి మంచి సాన్నిహిత్యం ఉంది.
అనేక సందర్భాల్లో వీళ్లిద్దరు కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడుకోవడం వంటివి చూసాము. అప్పుడప్పుడు కొట్లాడుకోవడం కూడా చూసాము. ఆ చనువు తోనే మోహన్ బాబు పవన్ కళ్యాణ్ ని ఈ ఈవెంట్ కి పిలవబోతున్నాడని, కచ్చితంగా ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు అనే ఊహకే అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ప్రభాస్ గురించి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో మాట్లాడడం మనమంతా చూసాము, కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. ఆయన నోటి నుండి పవన్ గురించి ఎలాంటి మాటలు రాబోతున్నాయి వినాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించి మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఏప్రిల్ రెండవ వారం లో ఈ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read: రజినీకాంత్ కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..? ఊచకోత అంటే ఇదేనేమో..?