
Naresh – Pavitra Lokesh Marriage: మీడియా లో ఈమధ్య వివాదాలకు కేంద్ర బిందువు గా మారిన ప్రేమ జంట నరేష్ – పవిత్ర.ప్రేమకి వయసుతో సంబంధం లేదు అని చెప్పడానికి ఉదాహరణగా నిల్చిన జంట ఇది.అంతకు ముందు నరేష్ కి ఇలాగే మూడు సార్లు ప్రేమ పుట్టింది,ఆయనలో దాచుకోలేనంత ప్రేమ ఉంది అన్నమాట.
అందుకే అందరికీ పంచుతూ ఉన్నాడు,పవిత్ర లోకేష్ కూడా తక్కువ కాదండోయ్!, ఈమె కూడా గతం లో ఒక కన్నడ టీవీ ఆర్టిస్టు ని ప్రేమించి పెళ్లాడింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వీళ్లిద్దరి ప్రేమ ఉద్యమం ఇక్కడితోనే ఆపేస్తారు అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో,పవిత్ర లోకేష్ మొదటి భర్త ఈ ప్రేమ ఉద్యమం నరేష్ తోనే ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది అంటూ రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.గతం లో కూడా ఆయన ఇలాగే పవిత్ర లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.
పవిత్ర మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘పవిత్ర లోకేష్ కి విలాసవంతమైన జీవితం అనుభవించడం అంటే బాగా ఇష్టం, అందుకోసం ఎలాంటి పనులు చెయ్యమన్నా చేస్తాది, నరేష్ కి 1500 కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.అవి కాజెయ్యడానికే అతన్ని ప్రేమలోకి దింపి, పెళ్లి చేసుకుంది.ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేసింది.ఒకవేళ నరేష్ ఆస్తులలో ఆమని భాగం చెయ్యకపోతే అతనితో విడాకులు తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళని ముగ్గులో దింపుతోంది.ఇదంతా పవిత్రకి అలవాటే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఈ మాటలకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ నెటిజెన్స్ నరేష్ కి జాగ్రత్తగా ఉండు అంటూ వ్యగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.మరోపక్క మూడవ భార్య రమ్య నరేష్ కి ఇంకా విడాకులు ఇవ్వలేదు.ఆమె నుండి కూడా నరేష్ కి రాబొయ్యే రోజుల్లో పెద్ద ముప్పు వాటిల్లో అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్న మాట .