
Ram Gopal Varma: ఒకప్పుడు టెక్నికల్ పరంగా గాని , టేకింగ్ పరంగా కానీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన సినిమాలు అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన దర్శకులకు ఒక పుస్తకం లాంటిది.అంత అద్భుతంగా ఆయన సినిమాలు తీసేవారు.హిట్/ప్లాప్ అనేది పక్కన పెడితే కచ్చితంగా ఆయన టేకింగ్ కోసం ఒక్కసారైనా ఆయన సినిమా చూడాల్సిందే.ఆరోజుల్లో అలా ఉండేవి రామ్ గోపాల్ వర్మ సినిమాలు.
టాలీవుడ్ లో సక్సెస్ లు అందుకున్న తర్వాత బాలీవుడ్ లో కూడా ఎన్నో సంచలనాత్మక సినిమాలు తీసి ఆరోజుల్లో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గొప్ప దర్శకుడు ఆయన.అప్పట్లో ఆయన గురించి చెప్పడానికి ఇంత విషయం ఉండేది.కానీ ఇప్పుడు మాత్రం అతని గురించి మాట్లాడుకోవడానికి ఏమి మిగలలేదు.గొప్ప మేధస్సు ని అతగాడు పనికిమాలిన విషయాలకు ఉపయోగిస్తున్నాడు.శివ , సర్కార్ , రంగీలా ఇలా ఎన్నో వెండితెర అద్భుతాలను ఆవిష్కరించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు బూతు సినిమాలు తీసుకుంటూ ఒక ఇండియన్ ఫిలిం డైరెక్టర్ నా అంత దిగజారలేరు అని చెప్పకనే చెప్పాడు.
గతం లో ఆయన ‘మియా మాల్కోవా’ అనే పోర్న్ స్టార్ తో ‘క్లైమాక్స్’ అనే సినిమా తీసాడు.సినిమా మొత్తం ఆమెని న్యూడ్ గా చూపించి తన కామవాంఛ ని తీర్చుకున్నాడు.అయితే ఆమెని ఈయన కలిసి చాలా రోజులు అయ్యిందట.ఆమె ఫోన్ నెంబర్ కూడా తన దగ్గర పోయిండట.ట్విట్టర్ లో ఆమెని ట్యాగ్ చేసి నీ ఫోన్ నెంబర్ పోయింది, ఒక్కసారి నాకు వాట్సాప్ లో నీ నెంబర్ నుండి మెసేజి చేస్తావా అంటూ ఒక ట్వీట్ వేసాడు.అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇంతకు మించి నువ్వు దిగజారలేవు అని అనుకున్న ప్రతీ సారి నువ్ దిగజారి చూపిస్తూనే ఉన్నావు అంటూ రామ్ గోపాల్ వర్మ ని ఆయన సొంత అభిమానులే తిడుతున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో అంత గొప్ప సినిమాలు తీసింది నిజంగా నువ్వేనా అంటూ రామ్ గోపాల్ వర్మ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజెన్స్.