spot_img
Homeఎంటర్టైన్మెంట్Pavitra Lokesh: రామారావును వదిలేసి పవిత్రా లోకేష్ పై పడ్డారు.. థియేటర్లు...

Pavitra Lokesh: రామారావును వదిలేసి పవిత్రా లోకేష్ పై పడ్డారు.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి.. ఇదెక్కడి వింతరా బాబు !

Pavitra Lokesh: వినడానికే విచిత్రంగా ఉన్నా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పై ‘పవిత్రా లోకేష్’ ఘాటు ప్రేమే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. నిన్న రిలీజైన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పవిత్రా లోకేష్ రవితేజకు తల్లిగా నటించింది. కానీ.. ఐటమ్ హీరోయిన్ వచ్చినప్పుడు వచ్చే విజిల్స్ ఆమె కనిపించిన ప్రతిసారి వినిపించాయి. కారణం.. నరేష్ – పవిత్రా లోకేష్ ఈ సినిమాలో అన్నా చెల్లెలు పాత్రల్లో కనిపించారు. దాంతో ఈ జంట‌ను చూసిన ప్రతిసారి ప్రేక్ష‌కులు హేళన నవ్వులు, ట్రోలింగ్ ఈలలతో గోలగోల చేశారు.

Pavitra Lokesh
Naresh, Pavitra Lokesh

ఒక్కటి రెండు రెండు థియేటర్స్ లో కాదు, దాదాపు అన్నీ థియేటర్స్ లో ఇదే రచ్చ. అందుకే, రామారావు సినిమా ఫీడ్ బ్యాక్ కంటే కూడా.. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పవిత్రా – నరేష్ ల పైనే ఎక్కువగా కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రసాద్స్ లాంటి మల్టీప్లెక్స్ లలో కూడా వీరు కనబడగానే విజిల్స్ పీక్స్ లో మోత మోగాయి. దీనిబట్టి.. పవిత్రా లోకేష్ -నరేష్ ప్రేమ వ్యవహారం జనంలోకి ఏ స్థాయిలో వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.

పవిత్ర లోకేష్, నరేష్ లు కూడా తమ బంధం పై జనం నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ ను ఊహించి ఉండరు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో పవిత్ర, నరేష్ ఒకే ఫ్రేములో కనిపించిన ప్రతిసారి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రేక్షకులు గొల్లున నవ్వుల మధ్య కొన్నిసార్లు సినిమాలోని మెయిన్ డైలాగ్స్ కూడా వినిపించలేదు. అసలకే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మ్యాటర్ లేదు. దీనికితోడు.. అనవసరమైనా ఈలలు గోలలు. అందుకే.. సినిమా సగం మందికి అస్సలు కనెక్ట్ కాలేదు.

ఒకపక్క మాస్ మహారాజ్ రవితేజ భారీ ఫైట్స్ చేస్తున్నా… ప్రేక్షకులు మాత్రం నరేష్, పవిత్ర కలిసి ఉన్న సీన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. సినిమాకి ఇది బాగా మైనస్ అయ్యింది. మొత్తానికి అందరూ రామారావుని వదిలేసి పవిత్రా లోకేష్ – నరేష్ ల పై పడ్డారు. రియల్ లైఫ్ లో వీరిద్దరూ అక్రమంగా కలిసి ఉంటున్నారు. అందుకే, ఆ ప్రభావం ఈ రీల్ లైఫ్ మీద బాగా పడింది.

ముఖ్యంగా మైసూర్ లోని ఒక హోటల్లో ఒకే రూమ్ లో నరేష్, పవిత్ర కలిసి కనిపించిన దగ్గర నుంచీ వారి ఇమేజ్ లు బాగా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రవితేజ రామారావు ఇమేజ్ ను కూడా బాగా డ్యామేజ్ చేశారు. థియేటర్స్ లో రామారావు పరిస్థితి పై టాలీవుడ్ మేకర్స్ మధ్య కూడా చర్చ మొదలైంది.

కచ్చితంగా ఇక నుంచి పవిత్రా లోకేష్ కి పవిత్రమైన పాత్రలు రాకపోవచ్చు. మొత్తమ్మీద లేటు వయసులో ఘాటు ప్రేమతో పాపం కెరీర్ ను పాడు చేసుకుంది పవిత్రా. ఆమె పై జాలి చూపించడం తప్ప మనం చేసేది ఏమి లేదు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper