New movies on OTT: ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు పలు చిత్రాలు, సిరీస్లను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చాయి. ఈ వారం థియేటర్స్ లో చెప్పుకోదగ్గ చిత్రాల విడుదల లేని క్రమంలో డిజిటల్ కంటెంట్ ఎంజాయ్ చేయండి. వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఈ వారం స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు, సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీ లో విలన్ గా రష్మిక..? ఆమె లుక్ ఎలా ఉండబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ వారం థియేటర్స్ లో పెద్దగా సందడి లేదు. మొగలిరేకులు సాగర్ నటించిన ది 100, సుహాస్ చిత్రం ఓ భామ అయ్యో రామ, వర్జిన్ బాయ్స్ తో పాటు ఒకటి రెండు స్మాల్ బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యాయి. గత వారాల్లో విడుదలైన తమ్ముడు, కన్నప్పలకు కూడా థియేటర్స్ లో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. హరి హర వీరమల్లు వచ్చే వరకు థియేటర్స్ వద్ద ప్రేక్షకుల సందడి ఉండకపోవచ్చు. అనంతరం కూలీ, వార్ 2 వంటి బడా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అయితే ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు, సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ కంటెంట్ ఇష్టపడే వారికి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఇటీవల బాగా బజ్ క్రియేట్ చేసిన 8 వసంతాలు చిత్రం సైతం ఓటీటీలోకి వచ్చేసింది. అలాగే తమిళంలో ఆదరణ పొందిన కలియుగమ్ 2024 సైతం స్ట్రీమ్ అవుతుంది. వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు, సిరీస్లు ఇలా ఉన్నాయి..
Also Read: 3 రోజుల్లో 1 లక్ష డాలర్లు..నార్త్ అమెరికాలో ‘హరి హర వీరమల్లు’ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్!
జియో హాట్ స్టార్
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2(వెబ్ సిరీస్)- జులై 11
ది రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ సీజన్ 9- జులై 11
మూన్ వాక్
రీఫార్మ్
బరీడ్ ఇన్ ది బ్యాక్ యార్డ్ సీజన్ 6- జులై 13
నెట్ఫ్లిక్స్
8 వసంతాలు- జులై 11
ఆప్ జైసా కోయి(హిందీ)-జులై 11
సెవెన్ బేర్స్(యానిమేషన్)
బ్రిక్(హాలీవుడ్)
అమోస్ట్ కాప్స్: జులై 11
మడి యట్ డెస్టినేషన్ వెడ్డింగ్- జులై 11
అమెజాన్ ప్రైమ్
కరాటే కిడ్స్-లెజెండ్స్- రెంట్ పద్దతిలో స్ట్రీమ్ కానుంది
ది అన్ హోలీ ట్రినిటీ-జులై 11
సోనీ లివ్: నరివెట్ట(మలయాళం) జులై 11
నోబు: జులై 12
సన్ నెక్స్ట్
కలియుగమ్ 2064(తమిళ్)- జులై 11