Allu Arjun Atlee movie: అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) మూవీ గురించి సోషల్ మీడియా లో రోజుకి ఒక వార్త లీక్ అవుతూ బాగా వైరల్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఏ చిన్న న్యూస్ బయటకు వచ్చినా నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవుతుంది. ఒక సినిమాకు షూటింగ్ దశలో ఇంత క్రేజ్ ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో 5 మంది హీరోయిన్లు ఉంటారు అనేది షూటింగ్ మొదలయ్యే ముందే మన అందరికి తెలుసు. అందులో రీసెంట్ గానే దీపికా పదుకొనే ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఎంపిక అయ్యింది. ముంబై లో అల్లు అర్జున్ , మృణాల్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు కూడా. త్వరలోనే మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ప్రకటన కూడా గ్రాండ్ గా చేయనుంది మూవీ టీం.
Also Read: 10 ఏళ్ల తర్వాత బాహుబలి సినిమాలో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టని ఈ మిస్టేక్ ను ఎవరైనా గమనించారా?
మరో ముగ్గురు హీరోయిన్స్ లో జాన్వీ కపూర్(Jhanvi Kapoor), అలియా భట్(Alia Bhatt), భాగ్యశ్రీ భోర్సే( Bhagyasri Bhorse), దిషా పటాని(Disha Patani) పేర్లను పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియా లో చాలా నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఇందులో ప్రముఖ హీరోయిన్ రష్మిక ఖరారు అయ్యిందట. ‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ తో ఆమె చేయబోతున్న మూడవ సినిమా ఇది. ఇందులో రష్మిక(Rashmika Mandanna) రెగ్యులర్ హీరోయిన్ రోల్ లో కనిపిస్తుంది అనుకుంటే పొరపాటే. కెరీర్ లో మొట్టమొదటి సారి ఆమె పూర్తి స్థాయి విలన్ క్యారక్టర్ లో కనిపించబోతుందట. అల్లు అర్జున్ తో ఈమెకు సినిమాలో భారీ ఫైట్స్ ఉంటాయట. అందుకే పోరాట సన్నివేశాల కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. నేషనల్ క్రష్ గా పిలవబడే రష్మిక విలన్ క్యారక్టర్ చేయడాన్ని యువత అంగీకరించడం కాస్త రిస్క్ తో కూడుకున్న పనినే.
Also Read: నాని ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు లుక్ లీక్..ఈ రేంజ్ లో ఉన్నాడేంటి బాబోయ్!
కానీ ఇప్పుడు స్టార్ హీరోలే విలన్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. జనాలు అంగీకరిస్తున్నారు కూడా. కాబట్టి రష్మిక ని కూడా అంగీకరిస్తారని అంటున్నారు. రష్మిక కూడా ‘పుష్ప’ నుండి రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ వస్తుంది. కాబట్టి ఇక నుండి రష్మిక నుండి కూడా ఇలాంటి రోల్స్ ని రెగ్యులర్ గా చూడొచ్చు అన్నమాట. వాస్తవానికి ఈ క్యారక్టర్ కోసం ముందుగా సమంత ని అడిగారట. సమంత ఇప్పటికే మూడు సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసింది. ఆమె అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని అనుకున్నారు కానీ , ఎందుకో ఆమె చివరి నిమిషం లో ఒప్పుకోలేదు..ఇప్పుడు ఆమె స్థానం లోకి రష్మిక వచ్చింది. చూడాలి మరి ఎలా నటిస్తుంది అనేది. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. మెయిన్ విలన్ క్యారక్టర్ కోసం హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది.