HariHara Veeramallu BoxOffice: సాధారణంగా ఒక సినిమా విడుదల తేదికి దగ్గరగా వచ్చి వాయిదా పడి, మళ్ళీ వేరే కొత్త విడుదల తేదీలో రిలీజ్ అయితే క్రేజ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో అయితే అసలు మూవ్మెంట్ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) విషయం లో ఇది రివర్స్ అయ్యింది. జూన్ 12 న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమా పూర్తి అవ్వకపోవడం వల్ల వాయిదా వేశారు. అయితే అప్పట్లో నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు, సోషల్ మీడియా లో ట్రోల్స్ వేరే లెవెల్ లో ఉండేవి. అడ్వాన్స్ బుకింగ్స్ అప్పట్లో అలా ఉండడానికి కారణం, ఈ సినిమా కంటెంట్ కి సంబంధించి ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఒక్కటి కూడా రాకపోవడమే. అయితే రీసెంట్ గానే ట్రైలర్ ని విడుదల చేశారు.
ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే నార్త్ అమెరికా లో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. కేవలం మూడు రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు, ఈ మూడు రోజుల్లో ఈ చిత్రం లక్షకు పైగా డాలర్లను రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో నార్త్ అమెరికా లో అతి తక్కువ సమయం లో లక్ష డాలర్లకు పైగా గ్రాస్ ని రాబట్టిన అతి కొద్దిసినిమాల్లో ఒకటిగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం నిల్చింది. ప్రస్తుతానికి అయితే 730 షోస్ ని షెడ్యూల్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ షోస్ ని షెడ్యూల్ చేయాల్సి ఉంది. నార్త్ అమెరికా లో దాదాపుగా 2500 షోస్ ని షెడ్యూల్ చేయబోతున్నారని టాక్. చివరి వారం లో భారీ జుంప్స్ ఉంటాయి కాబట్టి, రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
#HariHaraVeeraMallu – USA Premieres Pre Sales are at $83K+ from 230 Locations opened
Heading Towards $100k #HHVMUSABookings ⚔️ pic.twitter.com/T4YhmMmPjj
— Raju Pspk (@raju_pspk_45) July 11, 2025
రెండు మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ పవన్ కళ్యాణ్ సినిమాకి అంటే ఆయన రేంజ్ కాదు అనే చెప్పాలి. కానీ 5 ఏళ్ళు ఆలస్యం అవుతూ వచ్చిన సినిమాకి ఈ మాత్రం పుల్ వచ్చిందంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ స్టామినా అని అనుకోవచ్చు అంటూ ట్రేడ్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వేల ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం టికెట్ కౌంటర్లు వద్ద అమ్ముడుపోయేవి వేరే లెవెల్ లో ఉంటుందని, మూడు మిలియన్ డాలర్లకు దగ్గరగా వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు ఫ్యాన్స్. ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో తెలియాలంటే మరో 12 రోజులు ఆగాల్సిందే. గతంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రం లక్ష డాలర్లు దాటడానికి 9 రోజుల సమయం తీసుకుంటే, ఈసారి మాత్రం కేవలం మూడు రోజుల సమయం తీసుకుంది.
HariHaraVeeraMallu USA Premiere Advance Sales:
$83,326 – 230 Locations
Veera Rampage has officially Begun
Huge $30k jump in less than 12Hrs+
More locations will be opened from tomorrow, 13 days till premieres #HHVMUSABookings
pic.twitter.com/FNPFV6mns4— GHANI PSPK (@ghani9392) July 11, 2025