OG : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు రాబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఏపీ సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు సైతం ఆయన ఇమేజ్ ను పెంచే విధంగా ఉండాలి కానీ తగ్గించే విధంగా ఉండకూడదు. ఇక ఆయన చేసిన ‘హరిహర వీరమల’ (Hari Hara Veerramallu) సినిమాను జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రాబోతున్న ఓజీ (OG) సినిమా విషయంలో సైతం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి దసర కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘ఓజీ’ సెట్స్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్..కానీ ఆ విషయంలో పెద్ద మార్పు?
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా కోసం తొందరలోనే ఆయన తన డేట్స్ కేటాయించి సినిమాను ఫినిష్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓజీ (OG) సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఒక గ్యాంగ్ స్టర్ గురించి రాసుకున్న కథగా తెలుస్తోంది. మరి ఈ కథలో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతాలను సృష్టించబోతున్నట్టుగా తెలుస్తోంది…
అలాగే సుజిత్ సైతం సాహో (Sahoo) సినిమా తర్వాత ఒక భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అయింది అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో అందరినీ షేక్ చేస్తుంది. అది ఏంటి అంటే క్లైమాక్స్ లో హీరో పక్కనున్న వ్యక్తి అతన్ని మోసం చేసి వెన్నుపోటు పొడుస్తాడట. ఇలాంటి సీన్స్ ఇంతకుముందు కొన్ని సినిమాల్లో వచ్చినప్పటికి ఈ క్లాసిన్ చాలా వరకు ఎమోషనల్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే ఈ ట్విస్ట్ సినిమా థియేటర్లో భారీగా పేలబోతుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి నటుడు చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి అతని అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ‘ఈసారి ముగిద్దాం’ అంటూ సంచలన అప్డేట్ ఇచ్చిన ‘ఓజీ’ టీం..ఫోటో వైరల్!