OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఓజీ(They Call Him OG) మూవీ షూటింగ్ పునః ప్రారంభం రీసెంట్ గానే మొదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. నేడు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ కూడా అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. మరో నెల రోజుల్లో విడుదల అవ్వబోతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని కూడా పట్టించుకోకుండా, ఈ సినిమా మేనియా లో మునిగి తెలుస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కొన్ని రోజులు హైదరాబాద్ లో, మరి కొన్ని రోజులు తాడేపల్లి లో, మరి కొన్ని రోజులు ముంబై, పూణే లలో షూటింగ్ కార్యక్రమాలను జరపనున్నారు. మేకర్స్ ఒక్కరోజు కాల్ షీట్ థాయిలాండ్ లో షూటింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Also Read: ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలు చేయడం వెనక ఉన్న సీక్రెట్ ఇదేనా..?
దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కొన్ని క్లోజప్ షాట్స్, మరి కొన్ని ప్యాచప్ సన్నివేశాల కోసం థాయిలాండ్ లో కచ్చితంగా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి కుదరకపోతే, ఆ సన్నివేశాలను పూణే లో షూట్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. ఆగస్టు 15 లోపు ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ ని సిద్ధం చేస్తారట. సెప్టెంబర్ 5 న, లేకపోతే సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈమేరకు బయ్యర్స్ కి సమాచారం కూడా అందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ 70 శాతం వర్క్ కి సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్ వ్యవహరించాడు. కానీ ఇప్పుడు ఆయన వేరే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉండడం వల్ల మనోజ్ పరమహంస ఇక నుండి ఓజీ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు.
మనోజ్ పరమహంస ఇండియా లో ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇలా ఇండియా లో టాప్ 2 సినెమాటోగ్రాఫర్స్ గా పేరు తెచ్చుకున్న వీళ్లిద్దరు ఓజీ చిత్రానికి పనిచేయడం గమనించాల్సిన విషయం. ఈ చిత్రం పై ఇంత హైప్, క్రేజ్ క్రియేట్ అవ్వడానికి కారణం 2023 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కెమెరా యాంగిల్స్, షాట్స్ మేకింగ్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇందులో డైరెక్టర్ సుజిత్ క్రియేటివిటీ ఎంత ఉందో, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ పనితనం కూడా అంతే ఉంది. ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని మనోజ్ ఏ రేంజ్ లో అందుకుంటాడో చూడాలి.
Also Read: పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచడం వెనక ఉన్న కారణం ఏంటంటే..?