Ravi Shastri: టీమిండియాలో రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నప్పుడు.. రవి శాస్త్రి నుంచి అతడికి ఫుల్ సపోర్ట్ లభించేది. ముఖ్యంగా రోహిత్ సూపర్బ్ నాక్ ఆడినప్పుడు.. కామెంట్రీ చేసే రవి శాస్త్రి నోటి నుంచి వచ్చే మాటలు విభిన్నంగా ఉండేటివి. అవి గూస్ బంప్స్ తెప్పించేవి. సాధారణంగా ఎలివేషన్ లో మనం కేజిఎఫ్ సినిమా గురించి ప్రస్తావిస్తుంటాం కదా.. రవి శాస్త్రి మాట్లాడుతుంటే కేజిఎఫ్ సినిమాకు మించి రోహిత్ శర్మకు ఎలివేషన్లు పడేవి. ఒక రకంగా రోహిత్ శర్మకు విపరీతమైన పాపులారిటీ రావడంలో అతని ఆటతీరు ఒక కారణమైతే.. రవి శాస్త్రి ఇచ్చిన ఎలివేషన్లు మరో కారణం. అందువల్లే రవి శాస్త్రి – రోహిత్ అత్యంత చనువుగా ఉండేవారు.
Also Read: ఇండియా ఏ టీం ఇదే.. ఇందులో రాణిస్తేనే జాతీయ జట్టుకు.. కరణ్ నాయర్, జురెల్ కి ఛాన్స్
రోహిత్ శర్మ కెరియర్ ముగిసిన విధానంపై..
రోహిత్ శర్మ ఇటీవల సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను మాత్రమే కాదు.. చివరికి రవిశాస్త్రి ని కూడా షాక్ కు గురి చేసింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి రవి శాస్త్రి కి చాలా సమయమే పట్టింది. చివరికి రోహిత్ శర్మ శాశ్వత వీడ్కోలు నిర్ణయంపై రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఒకవేళ నేను కోచ్ ను అయితే..
రోహిత్ శర్మ తన సుదీర్ఘ ఫార్మాట్ కు సంబంధించిన కెరియర్ ముగించిన విధానంపై విచారం వ్యక్తం చేసిన రవి శాస్త్రి.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” ఇటీవల ఓ ఐపీఎల్ మ్యాచ్ సమయంలో రోహిత్ తో మాట్లాడే అవకాశం లభించింది. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో గనుక కోచ్ గా నేను ఉండి ఉంటే.. రోహిత్ శర్మను చివరి మ్యాచ్ కూడా ఆడించి ఉండేవాడిని. అప్పటికి ఆ సిరీస్ ఇంకా ముగిసిపోలేదు. రోహిత్ లాంటి ఛాంపియన్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదు. అతడు కనక ఆడి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది.. ఎందుకంటే బంగారు హుండీని చిల్లర వేయడానికి ఉపయోగించకూడదు. రోహిత్ లెవెల్ వేరు.. అతని ఆట తీరు కూడా వేరు. అటువంటి వ్యక్తిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని” రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. మొత్తానికి రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు గౌతమ్ గంభీర్, టీమిండియా మేనేజ్మెంట్ కు సూటిగా తగులుతున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే RO బయటికి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం జట్టు మేనేజ్మెంట్ అని.. జట్టు మేనేజ్మెంట్ అతనికి సరైన గౌరవం కనుక ఇచ్చి ఉంటే కచ్చితంగా సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగేవాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.