Number One Hero in Indian Cinema: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలా లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతున్న నేపథ్యంలో మన తెలుగు హీరోలు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ కి చాలా దగ్గరలో ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ (Prabhas) లాంటి నటుడు ఆయన చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటులు చాలామంది ఉన్నప్పటికి ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు అని అడిగితే మాత్రం దానికి సమానంగా మన తెలుగు హీరో అయిన ప్రభాస్ గురించి చెబుతూ ఉండడం విశేషం… బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో అప్పటినుంచి వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఒకవేళ ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అయినప్పటికి కలెక్షన్లు మాత్రం భారీ రేంజ్ లో వస్తున్నాయి.
Also Read: Hari Hara Veeramallu : హరి హర వీరమల్లు మీ ఊహకి మించి ఉంటుంది : ఏ ఏం రత్నం…
ఇక బాహుబలి 2 (Bhaubali 2) సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన కల్కి (Kalki) సినిమాతో 1200 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాడు. ఇక అలాగే సలార్ (Salaar) సినిమాతో 800 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాడు. బాలీవుడ్ హీరోలెవరు ఇలాంటి ఘనతను సాధించకపోవడం విశేషం…
ఇక ఇప్పుడున్న హీరోలందరిలో ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రాబోయే రోజుల్లో మన హీరోలు అందుకునే సక్సెస్ లను బట్టి ఎవరు నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్తారు అనేది చెప్పడం కొంచెం కష్టతరమే అవుతుంది.
Also Read: Mahesh Babu : మహేష్ బాబు ను నెంబర్ వన్ హీరోగా ఎదగకుండా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
అయినప్పటికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మీదట చాలా మంది స్టార్ హీరోలు నెంబర్ వన్ పొజిషన్ ను సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండటం విశేషం… మొత్తానికైతే బాలీవుడ్ హీరోల హవా కొనసాగకపోవడంతో తెలుగు హీరోలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది…