Childern: పిల్లలు చాలా నేర్చుకోవాల్సిన సమయం బాల్యమే. ఈ బాల్యం వారికి చాలా అవసరం. ఈ సమయంలో ఎంత యాక్టివ్ గా ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు. కానీ ప్రస్తుతం చాలా మంది తమ పిల్లలను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. మరీ ముఖ్యంగా పట్నంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను మరింత మంది పిల్లలతో ఆడనివ్వరు. గొడవలు జరుగుతాయి. కొట్టుకుంటారు అని వారిని ఇంట్లోనే ఉంచుతుంటారు. వారికి ఫోన్ లు, వీడియో గేమ్ లు ఇచ్చి ఇంట్లోనే కూర్చోబెడతారు. కానీ ఇలా చేయడం అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. మరి ఇంతకీ ఏం చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందామా?
Read Also: ఇంట్లో లక్ష్మీ, గణేష్ ల వెండి నాణేలను పెట్టుకుంటే జరిగేది ఇదే..
బాల్యంలో పిల్లలను ఎంత నేర్చుకోవడానికి ఫ్రీగా వదిలేస్తే అంత బెటర్. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. వారి లైఫ్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కంప్యూటర్ జనరేషన్ లో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. లేదంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పిల్లలు సమస్యల సుడిగుండంలో మునిగిపోతుంటారు. మీకు తెలియకుండానే వారి కెరీర్ ను నాశనం చేసిన తల్లిదండ్రులుగా మిగిలిపోతారు.
పిల్లలకు అసలు వీడియో గేమ్ లు, ఫోన్ లు, ట్యాబ్ లు ఇవ్వకండీ. మరీ ముఖ్యంగా టీవీల ముందు కూర్చో పెట్టవద్దు. వారిని ఆడనివ్వండి. పాడనివ్వండి. కొత్త విషయాలను నేర్చుకోనివ్వండి. పిల్లలతో ఆడుకోవడం వల్ల మరింత యాక్టివ్ అవుతారు. అందుకే మీరు వారిని ఇంట్లో బంధించకుండా కాస్త ఫ్రీగా వదిలేయాలి. కానీ మరీ ఎక్కువ ఫ్రీగా కూడా అసలు వదిలేయవద్దు. వారిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి.
Read Also: ఏపీకి సినీ ప్రముఖులు.. పరిశ్రమ విస్తరణకు ఇదే మంచి సమయం!
మొక్కై వంగినిదే మానై వంగుతుందా అంటారు. అందుకే చిన్నప్పుడు వారి అలవాట్లు, చేసే పనులు కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే తర్వాత మీరే చాలా విషయాలలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలతో వారు ఆడుకునే ఆటల వల్ల వారి బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. వారి శరీరం కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. పిల్లలతో కలిసి ఉంటే వారు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. మాట్లాడటం, ఆడుకోవడం వంటివి నేర్చుకుంటారు. మాటలు పర్ఫెక్ట్ గా నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీ పిల్లలను ఇంట్లో ఉంచి ఫోన్ లు అలవాటు చేయడం వల్ల వారి బ్రెయిన్ చాలా కుచించుకుపోతుంది. ఫోన్ లేకుండా ఉండలేకపోతారు. ఫోన్ ఉంటేనే లైఫ్ అన్నట్టుగా మారుతారు. అందుకే ఇలాంటి మెంటల్ ప్రెజర్ ల నుంచి మీ పిల్లలను దూరంగా ఉంచడానికి వారిని పిల్లలతో ఆడనివ్వండి. బయటకు వెళ్లనివ్వండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.