Mahesh Babu : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నాడు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందిన వాళ్ళు సైతం ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతుండడం విశేషం…మరి ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి సక్సెస్ కోసం మన హీరోలు విపరీతంగా కష్టపడుతున్నారనే చెప్పాలి…
సూపర్ స్టార్ కృష్ణ (Krishna)నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు(Mahesh Babu)… ఇక ఇలాంటి సమయంలోనే ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా సూపర్ స్టార్ గా అవతరించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తను స్టార్ హీరోగా మార్చిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… కెరియర్ స్టార్టింగ్ లో మురారి, ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో చాలా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న ఆయన అప్పుడే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారతాడు అంటూ చాలా వార్తలైతే వచ్చాయి. కానీ ఆ తర్వాత చేసిన సైనికుడు, అతిథి, ఖలేజా లాంటి సినిమాలు అతనికి భారీగా డిజాస్టర్లను మిగల్చడంతో ఆ లోపే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో వచ్చి వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు రావడంతో మహేష్ బాబు కొంతవరకు డీలపడ్డాడు.
Also Read : మహేష్ కోసం పోటీ పడుతున్న ఆ ముగ్గురు దర్శకులు..తదుపరి చిత్రం ఎవరితో అంటే!
ఒకవేళ ఆ మూడు సినిమాల్లో ఏవైనా రెండు సినిమాలతో ఆయన ఇండస్ట్రీ రికార్డులను మరోసారి బ్రేక్ చేసినట్లయితే ఆయన నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకునేవాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆయన సక్సెస్ ను సాధించలేకపోయాడు.
మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఒకెత్తయితే, ఆ తర్వాత మంచి సినిమాలను ఎంచుకొని మరోసారి మరో బ్లాక్ బస్టర్ ని దక్కించుకోవడం అనేది పెద్ద టాస్క్ గా మారుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకసారి సక్సెస్ వచ్చింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆ తర్వాత చేయబోయే రెండు మూడు సినిమాలు మీదనే వల్ల కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది. వరుసగా భారీ సక్సెస్ లు దక్కితే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, నెంబర్ వన్ హీరోలుగా మారే అవకాశాలైతే ఉంటాయి. కానీ మహేష్ బాబు మాత్రం చేజేతులారా తనే నెంబర్ వన్ పొజిషన్ ని జారవిడుచుకున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…