NTR Warinig To Koratala: గత ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు తెచుకున్నాడనే సంతోషం ఫ్యాన్స్ కి కలుగకుండా చేసాడు జూనియర్ ఎన్టీఆర్..ఎందుకంటే ఆ సినిమాలో చేసిన మరో హీరో రామ్ చరణ్ శంకర్ సినిమా ప్రారంభించి 70 శాతం కి పైగా షూటింగ్ ని కూడా పూర్తి చేసాడు..కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు కొరటాల శివ తో ప్రకటించిన సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమాలు కూడా చెయ్యలేదు.

దీనితో అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో నిరాశకి గురైయ్యారు..అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెల నుండి ప్రారంభించబోతున్నాడు ఇటీవలే అధికారిక ప్రకటన చెయ్యడం తో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..వాస్తవానికి ఈ మూవీ స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధం అయ్యింది..కానీ కొరటాల శివ గత చిత్రం ఆచార్య డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో, స్క్రిప్ట్ పై మరోసారి రీ వర్క్ చేసాడు..మామూలు కమర్షియల్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ సినిమాగా మార్చాడు.
Also Read: Vijay Devarakonda-Rashmika Romance : ఒకే గదిలో రష్మిక-విజయ్ దేవరకొండ… ఇండస్ట్రీని ఊపేస్తున్న వీడియో!
ఒకసారి ఘోరంగా దెబ్బతిన్నాను..ఈసారి ఎట్టిపరిస్థితిలో కూడా ఔట్పుట్ విషయం లో తగ్గకూడదని ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా సమయం కోరి, ఒక బృందం ని ఏర్పాటు చేసుకొని సరికొత్త స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు కొరటాల శివ..అయితే షూటింగ్ ప్రారంభం అయ్యేముందు కొరటాల శివ కి ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడట..ఎట్టిపరిస్థితిలోను బిజినెస్ వ్యవహారం లో కల్పించుకోవడానికి వీలు లేదని..నువ్వు అలా చేస్తే నేను ఇప్పుడే ఈ సినిమాని ఆపేస్తాను అని చెప్పాడట..ఎందుకంటే ఆచార్య సినిమా విషయం లో కొరటాల శివ దర్శకత్వం మీదకంటే ఎక్కువ శ్రద్ద బిజినెస్ పైనే పెట్టాడు..నిర్మాత నిరంజన్ రెడ్డి వద్ద హోల్ సేల్ గా ఈ సినిమా మొత్తాన్ని 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి , బయ్యర్స్ కి 150 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు.

ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయ్యి 80 కోట్ల నష్టం రావడం తో బయ్యర్స్ అందరూ కొరటాల శివ ని చుట్టుముట్టేశారు..దీనితో ఆయన చాలా దిగ్బ్రాంతికి లోనయ్యాడు..అలాంటి టెన్సన్స్ ఏమి పెట్టుకోకుండా ఉంటేనే ఈ సినిమా చేద్దాం..లేదంటే ఆపేద్దాం అని కొరటాల శివ కి చెప్పాడట..దీనితో కొరటాల కేవలం ఈ సినిమాకి రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నాడు..ఎలాంటి బిజినెస్ వ్యవహారాల్లో కూడా ఆయన తలదూర్చడం లేదని తెలుస్తుంది.
Also Read: Hero Sharwanand : ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్న హీరో శర్వానంద్.. అమ్మాయి డీటెయిల్స్ ఇవే!
[…] Also Read: NTR Warinig To Koratala: అలా చేస్తే సినిమాని ఆపేస్తా… […]