Hebah Patel: ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ కి లక్ కలిసి రాలేదు. మంచి ఆరంభం లభించినా స్టార్ కాలేకపోయింది. కన్నడ చిత్రం ‘అధ్యక్ష’తో హెబ్బా పటేల్ పరిశ్రమకు పరిచయమైంది. తెలుగులో ‘అలా ఎలా?’ అనే ఓ చిన్న చిత్రంలో నటించారు. ఆమెకు అనూహ్యంగా సుకుమార్ నిర్మాణంలో ఛాన్స్ వచ్చింది. కుమారి 21 ఎఫ్ టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ క్రైమ్ డ్రామా సూపర్ హిట్ కొట్టింది. సుకుమార్ కథ అందించగా పలనాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన కుమారి 21 ఎఫ్ పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. ఒక న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ యూత్ ని ఊపేసింది.

దేవిశ్రీ సాంగ్స్ సినిమాలో మరో హైలెట్. ఇక ఆల్ట్రా మోడ్రన్ గర్ల్ రోల్ లో హెబ్బా పటేల్ యాక్టింగ్ సూపర్ అని చెప్పాలి. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. హెబ్బా లుక్స్ ఆడియన్స్ ని ఫిదా చేశాయి. కుమారి 21 ఎఫ్ తర్వాత హెబ్బా టాలీవుడ్ లో స్టార్ అవుతుందని భావించారు. ఫేమ్ వచ్చినప్పటికీ స్క్రిప్ట్ సెలక్షన్ లో తడపడిన హెబ్బా కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కుమారి 21 ఎఫ్ రేంజ్ హిట్ మరలా ఆమెకు పడలేదు. దర్శకులు ఆమెతో కుమారి 21 ఎఫ్ తరహా చిత్రాలు చేశారు.

అయితే ఒకసారి వర్క్ అవుట్ అయిన ఫార్ములా ప్రతిసారి సక్సెస్ అవుతుందనుకుంటే అపోహే. హెబ్బా అంచనాలు తప్పై సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భీష్మ మూవీలో వాంప్ రోల్ చేసిన హెబ్బా పటేల్ రెడ్ మూవీలో రామ్ తో పాటు ఐటెం సాంగ్ లో ఆడిపాడారు. స్టార్ అయ్యే మాట అటుంచితే హెబ్బాకు హీరోయిన్ ఆఫర్స్ కూడా కరువయ్యాయి. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేశారు. అడపదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ ఆమెకు బ్రేక్ ఇచ్చే చిత్రం పడటం లేదు.

Also Read: Pawan Kalyan – Chandra Babu: చంద్రబాబుకు పవన్ మద్దతు ఇచ్చినట్టేనా?
కాగా ఆహాలో మస్టీన్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ రోజురోజుకు ఆదరణ పెంచుకుంటూ దూసుకెళుతుంది. ఈ క్రమంలో ఆమెకు అక్కడ ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు. ఆ మధ్య హెబ్బా బరువు పెరిగారు. అనూహ్యంగా షేప్ అవుట్ అయ్యారు. రెడ్ మూవీలోని ఐటెం సాంగ్ లో హెబ్బాను చూడలేకపోయారు. హీరోయిన్స్ లావైతే వాళ్ళ కెరీర్ ముగిసినట్లే. దీంతో ఆమె కష్టపడి సన్నబడ్డారు. అలాగే పొట్టి బట్టలు ధరించి గ్లామర్ షో చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందాలు ప్రదర్శిస్తూ మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: NTR Warinig To Koratala: అలా చేస్తే సినిమాని ఆపేస్తా అంటూ కొరటాల కి ఎన్టీఆర్ వార్నింగ్
[…] […]