NTR Trivikram Movie Update: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు దగ్గుబాటి రానా(Rana Daggubati). ‘బాహుబలి’ సిరీస్ తో ఆయనకు ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. కానీ ఎందుకో ఆ చిత్రం తర్వాత రానా తన కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోలేదు అనిపిస్తుంది. ‘నేనే రాజు..నేనే మంత్రి’ చిత్రం తప్ప ఆయన హీరో గా నటించిన సినిమాలు చాలా తక్కువే వచ్చాయి. బాహుబలి తర్వాత ఆయన రీసెంట్ గానే సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) ‘వెట్టియాన్’ చిత్రంలో నెగెటివ్ క్యారక్టర్ చేసాడు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రం లో కూడా కాస్త నెగెటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ చేసాడు. ఇప్పుడు మరోసారి ఆయన నెగెటివ్ క్యారక్టర్ చేయడానికి సిద్దమయ్యాడు. ఎన్టీఆర్(NTR), త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో రీసెంట్ గానే ఒక సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. కార్తికేయ స్వామి జీవిత చరిత్రలో ఎవరికీ తెలియని ఒక అంకం గురించి ఈ చిత్రం తెరకెక్కనుంది.
Also Read: రామ్ చరణ్ పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తున్న స్టార్ హీరోయిన్…
ఈ సినిమాలో విలన్ గా దగ్గుబాటి రానా నటించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. రీసెంట్ గానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రానా ని ఈ క్యారక్టర్ కోసం సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్, రానా కాంబినేషన్ వెండితెర మీద చూసేందుకు కాస్త విచిత్రం గా అనిపించొచ్చు. ఎందుకంటే రానా కటౌట్ ఎలాంటిదో దేశం మొత్తానికి తెలుసు. ఎన్టీఆర్ కాస్త పొట్టిగానే ఉంటాడు అనే విషయం కూడా అందరికి తెలుసు. వీళ్లిద్దరి మధ్య ఏదైనా ఫైట్ సన్నివేశం వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు నెటిజెన్స్. కానీ ఎన్టీఆర్ ఎదుట ఎంతటి కటౌట్ ఉన్న వారైనా సరే నటన తో అవలీల గా డామినేట్ చేయగలడు అని ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్న మాట. ఇందులో రానా రాక్షసుల రాజుగా కనిపించబోతున్నాడని టాక్.
Also Read: జురాసిక్ వరల్డ్ రీబర్త్’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?
రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేసాడట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేశాడట. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ని రానా ఈ చిత్రం ద్వారా అందుకోబోతున్నాడు. కానీ దగ్గుబాటి అభిమానులు మాత్రం నిన్ను హీరో గా పెద్ద రేంజ్ లో చూడాలని ఆశపడుతుంటే, నువ్వు మాత్రం క్యారక్టర్ రోల్స్ కి పరిమితం అయ్యావ్ అంటూ సోషల్ మీడియా లో వెంకటేష్ ఫ్యాన్స్ రానా ని ట్యాగ్ చేసి వాపోతున్నారు. హాలీవుడ్ హీరో రేంజ్ లుక్స్ పెట్టుకొని కూడా రానా దానిని వినియోగించుకోవడం లేదని బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి అవ్వగానే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.