Sreeleela item song in Peddi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది . గత 50 సంవత్సరాలు నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకొచ్చిన ఆయన ఇప్పటికీ మంచి సినిమాలను చేయడానికి తీవ్రమైన ఆసక్తిని చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక అతని ప్లేస్ ని భర్తీ చేసే హీరోలు ఈ జనరేషన్ లో ఎవ్వరూ లేరు అంటే ఆయన అప్పట్లోనే ఎంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం విశేషం…ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది… ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా మీద ఆయన తీవ్రమైన ఆశలైతే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని వీలైతే ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సైతం తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ని కూడా డిజైన్ చేశారట.
Also Read: అక్షరాలా 60 కోట్ల రూపాయిలు..మొదలైన ‘హరి హర వీరమల్లు’ రికార్డుల వేట!
అయితే ఆ సాంగ్ లో ఎవరిని తీసుకోవాలి అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ ఐటెం సాంగ్ లో శ్రీలీల (Sreeleela) ఆడి పాడబోతోంది అంటూ కొంతమంది చెబుతుంటే మరి కొంతమంది మాత్రం శ్రీలీలా కాకుండా వేరే కొత్త హీరోయిన్ ని ఈ ఐటెం సాంగ్ లో ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ‘తమ్ముడు’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రమోషన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేదు!
ఇక పుష్ప 2 (Pushpa 2) సినిమాలో శ్రీ లీల చేసిన ఐటెం సాంగ్ కి మంచి గుర్తింపు రావడంతో ఆమె ఐటెం సాంగ్స్ చేయడంలో కూడా మంచి పాపులారిటిని సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో కనక ఆమె స్పెషల్ సాంగ్ లో కనిపించినట్టయితే ఆమెకు మంచి గుర్తింపు వస్తుంది. రామ్ చరణ్ డాన్స్ అదరగొడతాడు అలాగే శ్రీలీల సూపర్ స్టెప్పులతో ప్రేక్షకులం మెప్పిస్తుంది. కాబట్టి ఇద్దరి ఎనర్జీకి సాంగ్ అల్టిమేట్ గా భారీ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి నిజంగానే శ్రీలీల ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే సినిమా యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిన అవసరమైతే ఉంది…