Jurassic World Rebirth Review: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…1993 వ సంవత్సరములో స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన జురాసిక్ పార్క్ పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే… ఆ సినిమాని చూసి భయపడని వాళ్ళు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక డైనోసార్లు అనేవి ఇలా ఉంటాయి అని ప్రేక్షకులందరికి తెలియజేసి వాటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగబోతోంది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇప్పుడు ‘జురాసిక్ వరల్డ్ ది బర్త్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ప్రస్తుత కాలంలో తరుచుగా గుండె జబ్బులు వచ్చి చనిపోతున్నారు. అలాంటి గుండె జబ్బులతో పాటు మరిన్ని వ్యాధులను నిర్మూలించాలంటే డైనోసార్లు బ్లడ్ నుంచి ఒక మెడిసిన్ ని కనుక్కుంటే వాటికి చెక్ పెట్టొచ్చు. అయితే ఇక్కడొక మెలిక ఉంది. కేవలం బతికున్న డైనోసార్స్ రక్తం మాత్రమే ఈ ప్రయోగానికి పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పడంతో ఫార్మస్యూటికల్స్ ప్రతినిధి అయిన మార్టిన్ (రూపర్ట్ ఫ్రెండ్)…అలాగే అడ్వెంచర్ ఆపరేషన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించుకున్న జోరా బెన్నెట్ (స్కార్లెట్ జాన్సన్) తో కలిసి డైనోసార్స్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అయితే ఆ డైనోసార్స్ నుంచి రక్తం తీయడానికి డాక్టర్ హెన్రీ (జోనాథన్ బెయిలీ) ని కూడా తీసుకెళ్తారు…అయితే వీళ్ళు ముగ్గురు అనుకున్న పనిని సక్రమంగా పూర్తి చేశారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే జురాసిక్ పార్క్ మొదటి అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమా వచ్చిన తర్వాత డైనోసార్స్ ను బేస్ చేసుకొని చాలా సినిమాలైతే వచ్చాయి. 2022వ సంవత్సరంలో ‘డైనోసర్స్ డివినియన్’ పేరుతో వచ్చిన సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదు…ఇక ఇప్పుడు వచ్చిన డైనోసార్స్ వరల్డ్ రీబర్త్ మూవీ లో కథ కొంచెం కొత్తగా అనిపించింది. అయితే విజువల్స్ పరంగా చూసుకుంటే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు…అయితే వీళ్ళు ముగ్గురు కలిసి మిషన్ గురించి మాట్లాడుకుంటారు.ఆ వెంటనే వాళ్ళు మరపడవలో సముద్రం లోకి బయలుదేరుతారు. ఇక ఇందులో ఒక ఫ్యామిలీని కూడా యాడ్ చేశారు. నిజానికి ఆ ఫ్యామిలీ లేకపోయిన పెద్దగా వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. కానీ ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళను యాడ్ చేశారు…ఇక ఎమోషనల్ సీన్స్ కొన్ని వర్కౌట్ అయినప్పటికి ప్రేక్షకుడు మెచ్చుకునే రేంజ్ లో అయితే లేవు…కొన్ని సన్నివేశాలు క్యూరియాసిటిని రేకెత్తించేలా ఉన్నప్పటికి వాటికి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే ఇవ్వలేదు…ఇక ఈ సినిమా ముందుకు వెళ్లిన కొద్ది బోరింగ్ గా సాగిందే తప్ప అంత ఇంట్రెస్టింగ్ గా లేదు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే స్కార్లెట్ జాన్సన్ చాలా మంచి పెర్ఫమెన్స్ అయితే ఇచ్చాడు…ఇక మహార్షలా అలీ కూడా విభిన్నమైన సన్నివేశాల్లో డిఫరెంట్ నటనను ప్రదర్శించాడు…జోనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్ చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు…ప్రతి సీన్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా బాగా నటించి మెప్పించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగా కుదిరింది… విజువల్స్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి… ముఖ్యంగా డైనోసార్ వీళ్ళ మీద ఎటాక్ చేసినప్పుడు వచ్చిన విజువల్స్ చాలా రియలెస్టిక్ గా ఉన్నాయి…అసలు ఎక్కడ కూడా అది సీజీ అనే విషయం అయితే తెలియడం లేదు…
ప్లస్ పాయింట్స్
విజువల్స్
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.25/5