NTR , Prashanth Neel
NTR and Prashanth Neel : #RRR వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) గత ఏడాది ‘దేవర'(Devara Movie) చిత్రంతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆరంభం లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, రోజులు గడిచే కొద్దీ టాక్ మెరుగుపడుతూ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా తెలుగు లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో , హిందీ లో కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ మధ్య మధ్యలో వార్ 2(War 2 Movie) మూవీ షూటింగ్ లో పాల్గొంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
Also Read : ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా క్లైమాక్స్ లో ఎన్టీయార్ ఇలా కనిపించబోతున్నాడా..?
ఒక పాట మరియు క్లైమాక్స్ ఫైట్ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయినా వెంటనే ఆయన ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ లేకుండా కొన్ని యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ మొదటి షెడ్యూల్ లో చిత్రీకరించాడు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక రెండవ షెడ్యూల్ ని వచ్చే నెలలో ప్రారంభించబోతున్నాడు, ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రశాంత్ నీల్ సతీమణి సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఆమె స్టోరీలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలిసి చిల్ అవుతున్న ఫోటో ని స్టోరీ లో అప్లోడ్ చేసింది.
ఇందులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య మందు బాటిల్, సిగరెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. వీటిని చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. ఎన్టీఆర్ ఇంతకు ముందు అనేక ఇంటర్వ్యూస్ లో సిగరెట్, మందు తాగే అలవాటు లేదని చెప్పుకొచ్చేవాడు, కానీ ఇప్పుడేంటి ఇలా తాగుతున్నాడు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఇప్పుడే కాదు, రెండు మూడు సార్లు ఎన్టీఆర్ ఇలా దొరికిపోయాడు. ప్రైవేట్ పార్టీ నుండి వస్తూ చేతిలో మందు గ్లాస్ ని పట్టుకొని నడుస్తూ ఉంటాడు, బయటకు రాగానే మీడియా ఉందనే విషయం తెలుసుకొని, తనతో పాటు వస్తున్న డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చేతిలో మందు గ్లాస్ పెట్టాడు. ఇలాంటి చాలా ఉదాహరణలే ఉన్నాయి. కానీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కి ఎలాంటి అలవాట్లు లేవని బలంగా నమ్ముతూ ఉంటారు.
Also Read : ఎన్టీయార్ ను మూడు రోజులు ఉపవాసం ఉంచిన ప్రశాంత్ నీల్…కారణం ఏంటంటే..?