https://oktelugu.com/

Prashanth Neel and NTR : ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా క్లైమాక్స్ లో ఎన్టీయార్ ఇలా కనిపించబోతున్నాడా..?

Prashanth Neel and NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.

Written By: , Updated On : March 20, 2025 / 09:42 AM IST
Prashanth Neel , NTR

Prashanth Neel , NTR

Follow us on

Prashanth Neel and NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ విజయాన్ని సాధించమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ భారీ బాడీ తో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి…

కన్నడ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు ప్రశాంత్ నీల్… ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికిపాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తు గా మరబోతున్నాయి. ఎలాగైనా సరే ఇకమీదట తను చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రభాస్ (Prabhas) తో చేసిన సలార్ (Salaar) సినిమాతో 800 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక 2000 కోట్ల మార్కును దాటడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా ఎదగమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికోసం జూనియర్ ఎన్టీఆర్ ని విపరీతంగా కష్టపెడుతున్నాడట.

Also Read : ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కి చెప్పిన ఆ ఒక్క మాటతో అభిమానులు ఖుషి అవుతున్నారా..?

ఇక అలాగే ఈ సినిమా క్లైమాక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ విడిచి మరి తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించాల్సిన అవసరమైతే ఉందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బాడీ ఫిట్ గా ఉంటుంది. కానీ అతనికి ఇప్పటివరకు సిక్స్ ప్యాక్ రావడం అనేది మనం ఎప్పుడూ చూడలేదు.

మరి ఈ సినిమా కోసం అతన్ని విపరీతంగా కష్టపెట్టైనా సరే సిక్స్ ప్యాక్ ని రప్పించే విధంగా ప్రశాంత్ నీల్ ప్రణాళికలు రూపొందిస్తున్నారట. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో అతన్ని భారీగా చూపిస్తాడా క్లైమాక్స్ పండాలంటే అతని బాడీ చాలా ఇంపార్టెంట్ అని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట.

ఇక పెద్ద ఫైట్ లో అతను షర్టు లేకుండా కనిపిస్తూ ఒక్కొక్కటి తాట తీయడం అనేది చూసిన ప్రేక్షకులందరు ఒక హై ఫీల్ కి లోనవుతారనే ఉద్దేశ్యంతోనే ప్రశాంత్ నీల్ ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అది కూడా న్యాచురల్ గా ఉంటే ప్రేక్షకుడికి మంచి ఫీల్ అయితే కలుగుతుందని తను భావిస్తున్నారట. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Also Read : ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ మూవీ షూట్ లో జాయిన్ అయిన స్టార్ హీరో…