https://oktelugu.com/

Intermediate Admissions: ముందస్తుగా ఇంటర్ అడ్మిషన్లు.. ప్రైవేట్ ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందా?

Intermediate Admissions ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ముగిశాయి. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు సెలవులని ఇళ్లకు వెళ్లిపోయారు. సెకండియర్‌ విద్యార్థులు ఎంసెట్, నీట్, ఇతర పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

Written By: , Updated On : March 24, 2025 / 11:26 AM IST
Intermediate Admissions

Intermediate Admissions

Follow us on

Intermediate Admissions: ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. జవాబు పత్రాలు మూల్యాంకనం కూడా మొదలైంది. పదో తరగతి పరీక్షలు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇండర్‌ అడ్మిషన్లు ముందస్తుగా మొదలు పెట్టబోతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ముగిశాయి. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు సెలవులని ఇళ్లకు వెళ్లిపోయారు. సెకండియర్‌ విద్యార్థులు ఎంసెట్, నీట్, ఇతర పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పదో తరగతి పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇంటర్‌ అడ్మిషన్లు ఏప్రిల్‌ 7 నుంచి స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈమేరకు అన్ని కళాశాలలకు సమాచారం అందించింది. ఇదే సమయంలో సెకండియర్‌ తరగతులు కూడా ఏప్రిల్‌ 7 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయిచింది. మే నెలంతా సెలవులు ఇచ్చి… జూన్‌ 2 నుంచి కాలేజీలు పునః ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థులు షాక్‌ అయ్యారు. ఇదే సమయంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ముందస్తుగా అడ్మిషన్లు స్వీకరిస్తుంది. ఈమేరకు పూర్తి సమాచారాన్ని సంబంధిత బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లను (bie.ap.gov.in)లో అందుబాటులో ఉంచనుంది. అక్కడ 2025–26 కోసం అకడమిక్‌ క్యాలెండర్‌ లేదా అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

Also Read: హైదరాబాద్‌ జీవన వ్యయం.. బతకడానికి ఎంత కావాలో తెలుసా?

ప్రైవేటు కోసమేనా..
ఇంటర్‌ అడ్మిషన్లను ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు ఇప్పటికే మొదలు పెట్టాయి. అనధికారికంగా దరఖాస్తులు స్వీకరించాయి. కార్పొరేట్‌ కళాశాలల్లో అయితే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కూడా అయింది. అయితే కొన్ని ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు జరగడం లేదు. దీంతో వారి కోసం ఏపీ ప్రభుత్వం అడ్మిషన్‌ విధానంలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రైవేటుకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంటర్‌ అడ్మిషన్లు ఇలా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్‌ అడ్మిషన్‌ ప్రక్రియ సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది. 2025–26 విద్యా సంవత్సరం కోసం ఇంటర్‌ అడ్మిషన్‌ ప్రక్రియ గురించి సాధారణ సమాచారం ఇక్కడ ఉంది:
ఇంటర్‌ అడ్మిషన్‌ ప్రక్రియ:
అర్హత (Eligibility):
విద్యార్థులు 10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు లేదా ప్రత్యేక కోర్సులకు కనీస మార్కులు (Cut-off) ఉండవచ్చు.

అప్లికేషన్‌ ప్రక్రియ (Application Process):
ఆన్‌లైన్‌ మోడ్‌: ఆంధ్రప్రదేశ్‌లో BIEAP (bie.ap.gov.in) మరియు తెలంగాణలో ఖీ TSBIE (tsbie.cgg.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో APOASIS (Andhra Pradesh Online Admission System for Intermediate Stream) లేదా TSBIE ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆఫ్‌లైన్‌ మోడ్‌: కొన్ని ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ కాలేజీలు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను కూడా అంగీకరిస్తాయి. దీనికి కాలేజీలో ఫారమ్‌ తీసుకొని సమర్పించాలి.

అవసరమైన డాక్యుమెంట్లు: ఇ మార్క్‌షీట్, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (TC), కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు మొదలైనవి.

ఎంపిక ప్రక్రియ (Selection Process):
అడ్మిషన్లు సాధారణంగా 10వ తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్‌ల ఆధారంగా (మెరిట్‌ బేసిస్‌) జరుగుతాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో సీట్లు పరిమితంగా ఉంటాయి కాబట్టి, మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
ప్రైవేట్‌ కాలేజీలలో కొన్నిసార్లు ఎంట్రన్స్‌ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూ ఉండవచ్చు.

ఫీజు (Fees):
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో ఫీజు చాలా తక్కువ లేదా ఉచితం (పుస్తకాలు కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి).
ప్రైవేట్‌ కాలేజీలలో ఫీజు కోర్సు (MPC, BiPC, CEC, MEC మొదలైనవి) మరియు కాలేజీ సౌకర్యాలను బట్టి రూ. 20,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉండవచ్చు.
దరఖాస్తు ఫీజు: ఆన్‌లైన్‌ అప్లికేషన్‌కు సాధారణంగా రూ. 50–200 వరకు ఉంటుంది (కేటగిరీని బట్టి).