NTR And Prashanth Neel: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలున్నప్పటికి సింహాద్రి సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ అందుకున్న మాస్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆ సినిమాతో ఆయన ఇండస్ట్రీలో మాస్ హీరోగా అవతారం ఎత్తాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుతిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తు తన అభిమానులను అలరిస్తున్నాడు…
Also Read: విక్రమ్ మాస్ విశ్వరూపం.. దుమ్ములేపేసిన ‘వీర ధీర సూర’ టీజర్.. ఈసారి గురి తప్పేలా లేదు!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక చాలావరకు సక్సెస్ లను కూడా సాధిస్తూ తోటి హీరోలెవ్వరికి సాధ్యం కాని రీతిలో మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన వరుసగా ఏడు సినిమాలతో మంచి విజయాలను అందుకొని తనకు తానే పోటీ అని నిరూపించుకున్నాడు. ఇక ప్రస్తుతం ‘వార్ 2’ (War 2)సినిమాతో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా కోసం ఆయన తీవ్రమైన కసరత్తులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఒక సీన్ లో నటించడానికి దాదాపు మూడు రోజులపాటు ఉపవాసం ఉండాల్సిన అవసరమైతే ఉందట. ఎందుకంటే ఆ సీన్ లో ఎన్టీఆర్ బాగా చిక్కిపోయినట్టుగా కనిపించాల్సి ఉంటుంది. అందువల్ల అతన్ని మూడు రోజులపాటు ఉపవాసం ఉంచే విధంగా ప్రశాంత్ నీల్ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
మరి ఎన్టీఆర్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషమనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి ఈ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మేకింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉండడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే సినిమాలను చేస్తున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను కూడా సాధించి ఒక కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…ఇప్పటికే ప్రభాస్ (Prabhas) తో చేసిన సలార్ సినిమా మంచి విజయాన్ని సాధించింది…దాంతో ప్రభాస్ గో చేయాల్సిన సలార్ 2(Salaar 2) మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది…
Also Read: మహేష్ , రాజమౌళి మూవీ సెట్స్ లో హోలీ ఆడిన హీరోయిన్ ప్రియాంక చోప్రా..వైరల్ అవుతున్న ఫోటోలు!