NTR and Prashanth Neel : ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) ఒక భారీ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో చేస్తున్న సినిమా మీదనే ఆయన భారీ అశలైతై పెట్టుకున్నాడు. ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లను కొల్ల గొడుతుందనే నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఒక యాక్షన్ ఎపిసోడ్ ను కూడా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ సైతం ఈ సినిమా కోసం భారీగా కసరత్తులు చేస్తున్నారట. మొత్తానికైతే వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక సినిమా రికార్డుల విషయం పక్కన పెడితే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ ఫాదర్ గా నటిస్తున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు అంటే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) గా తెలుస్తోంది. మోహన్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో యమదొంగ (Yamadonga) అనే సినిమా వచ్చింది. ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఎన్టీఆర్ మోహన్ బాబుల కాంబినేషన్ కి కూడా మంచి పేరు దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే రిపీట్ అవ్వలేదు.
Also Raed : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ మాత్రం వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూపించి మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మోహన్ బాబు చాలా మంచి నటుడు ఆయనకు తగ్గ క్యారెక్టర్ పడితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
కానీ ఆయన అందరి సినిమాల్లో నటించడానికి ఒప్పుకోడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో అతనికి చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ కూడా మోహన్ బాబు అయితేనే ఆ పాత్రకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన్ని తీసుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసి మొత్తానికైతే ఒప్పించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ విషయం మీద ఇటు ఎన్టీఆర్ గానీ, అటు మోహన్ బాబు గానీ, ప్రశాంత్ నీల్ గాని ఎవరూ కూడా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మాత్రం ఈ విషయం మీద దర్శకుడు స్పందించాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!