Pawan Kalyan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి క్రేజ్ ను సంపాదించుకుంటు ముందుకు దూసుకెళుతున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)…ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉంచిన సినిమాలను పూర్తి చేసే పనిలో తను పూర్తిగా నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది.
Also Read : పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..ఈసారి మిస్ అయ్యే ప్రసక్తే లేదు!
మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. కెరియర్ మొదట్లోనే వరుసగా ఏడు విజయాలతో ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో మరింత సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పటికి ఆయన పాలిటిక్స్ లు చాలా బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమాకు సంబంధించిన షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వీలైనంత తొందరగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొని బ్యాలెన్స్ షట్ మొత్తాన్ని ఫినిష్ చేశాడు. ఇక దాంతో అతని అభిమానులు పవన్ కళ్యాణ్ మంచి ఊపు మీద ఉన్నాడు.
కాబట్టి ఈ స్పీడ్ లోనే తన తదుపరి సినిమాలైనా ఓజీ (OG), ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Sing) సినిమాలకు తన డేట్స్ కేటాయించి వీలైనంత తొందరగా ఆ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేస్తే బాగుంటుందని తద్వారా ఆ మూవీస్ కూడా తొందరగా రిలీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఐదు కోట్ల మంది జీవనాడి అమరావతి.. పవన్ భావోద్వేగ ప్రసంగం!
పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో ఈ సినిమాల మీద తను డేట్స్ కేటాయించే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత ఈ రెండు సినిమాల మీద ఫోకస్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా తన అభిమానులను ఎలా మెప్పిస్తాడు అనేది…
ప్రస్తుతం పాలిటిక్స్ లో ముందుకు దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాల మీద ఫోకస్ చేసే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…