Rajamouli and Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దర్శకులు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించి పెట్టడంతో ఇప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులు సైతం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…కెరీర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ (Student Number One) సినిమా నుంచి త్రిబుల్ ఆర్ (RRR) సినిమా వరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ లను సాధించినవే కావడం విశేషం…ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాతో కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతోంది. హాలీవుడ్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు అడ్వెంచర్ జానర్ లోనే వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి. ఇలాంటి జానర్ లో సినిమా తీయాలంటే దానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ప్రతి సీన్ ఎంగేజింగ్ గా ఉండటమే కాకుండా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో రేకెత్తించగలగాలి అలా చేసినప్పుడు మాత్రమే ఈ సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తాయి. మరి రాజమౌళి సైతం ఈ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. కాబట్టి ఆయన సగటు ప్రేక్షకులందరిని మెప్పించగలను అనే ఒక కాన్ఫిడెంట్ తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఆయన ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో రాజమౌళి గురువు గారు దర్శకేంద్రుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాఘవేంద్రరావు (Raghavendra Rao) ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడు అనే విషయాలైతే తెలుస్తున్నాయి.
మహేష్ బాబు (Mahesh Babu) ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా రాఘవేంద్రరావు గారే కావడం విశేషం…ఇక రాజమౌళి తన గురువు అయిన రాఘవేంద్రరావు గారిని డైరెక్ట్ చేయడం అనేది అతనికి చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుందట. నిజానికి ఈ పాత్ర కోసం ఇతర నటులను అనుకున్నప్పటికి ఫైనల్ గా రాజమౌళి రాఘవేంద్రరావు గారినే ఫిక్స్ అయ్యారట. మరి ఇంతకీ ఆ పాత్ర ఏంటి సినిమాలో ఎంతసేపు ఆయన కనిపించబోతున్నారు.
మహేష్ బాబు కాంబినేషన్ లో అతనికి ఎన్ని సీన్లు పడబోతున్నాయి అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరి మొత్తానికైతే తన గురువుగారిని డైరెక్టు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఈ విషయాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రావాల్సి ఉంది. రాజమౌళి తొందరలోనే వీటన్నింటికి సంబంధించిన విషయాలను తెలియజేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!