NTR and Prashanth Neel : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో ఇండస్ట్రీ హిట్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరి సపోర్టు లేకుండా పాన్ ఇండియా సినిమాను చేసి భారీ గుర్తింపు సంపాదించుకున్న ఏకైక దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel)…ఆయన చేసిన కేజిఎఫ్ (KGF), సలార్(Salaar) లాంటి సినిమాలు అతన్ని స్టార్ డైరెక్టర్ గా మార్చడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. భారీ ఎలివేషన్స్ తో సినిమాలను తీయడంలో ఆయనను మించిన దర్శకుడు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రతి సీన్ ను భారీగా చూపించి అందులోని ఎమోషన్ ను హైలెట్ చేస్తూ ప్రేక్షకుడి చేత విజిల్స్ వేయించడంలో ప్రశాంత్ నీల్ సిద్ధహస్తుడు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఇక ఈ నెల నుంచి ఎన్టీఆర్ కూడా సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.ఎన్టీయార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు కాబట్టి అతనితో కొన్ని సీన్స్ ని చిత్రీకరించిన తర్వాత మే చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారట.
మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో తో ప్రశాంత్ నీల్ లాంటి ఒక మాస్ డైరెక్టర్ కలిసి చేయబోతున్న ఈ సినిమా భారీ రేంజ్ లో అద్భుతాలను క్రియేట్ చేయడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి.
మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పాన్ ఇండియాలో ఎలాంటి ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంది. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ దక్కుతుందా లేదా అనే విషయాల పట్ల కూడా విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి.
మరి ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వస్తే గాని ఈ సినిమా ఏ కథతో వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రాదు…ఇక ఈ సినిమా గ్లింప్స్ కోసం యావత్ ఎన్టీఆర్ అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : మందు, సిగిరెట్స్ తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..ఫోటోలు వైరల్!