NTR and Prashanth Neel : ‘దేవర'(Devara Movie) లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలై ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ లేకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. ఎన్టీఆర్ ఎప్పటి నుండి జాయిన్ అవుతాడు అనే దానిపై నిన్న మొన్నటి వరకు స్పష్టత ఉండేది కాదు. ఎందుకంటే ఆయన బాలీవుడ్ లో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ‘వార్ 2′(War2 Movie) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశలో ఉంది. రీసెంట్ గానే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ ని షూట్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ జరుగుతుంది. మరో వారం రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉండడంతో ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దమయ్యాడు.
Also Read : ఎన్టీయార్ ను మూడు రోజులు ఉపవాసం ఉంచిన ప్రశాంత్ నీల్…కారణం ఏంటంటే..?
కాసేపటి క్రితమే మూవీ టీం ఎన్టీఆర్ ఈ నెల 22వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని అధికారికంగా ఒక ట్వీట్ ద్వారా ప్రకటించారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రాన్ని ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం లేనందున వచ్చే ఏడాది ఏప్రిల్ 9 వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వాసంత్ నటిస్తుందని అంటున్నారు. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడు. ఇంత సన్నగా ఎన్టీఆర్ ని అదుర్స్, కంత్రి సమయంలోనే మనమంతా చూసి ఉంటాము.
ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇండియా వైడ్ గా ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో కొందరు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించే అవకాశాలు ఉన్నాయి. తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఇందులో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి కానీ, అందులో ఎంత నిజం ఉంది అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అంతే కాదు ఈ సినిమాకు కెజీయఫ్ యూనివర్స్ కి లింక్స్ ఉన్నాయంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని అక్టోబర్ నెలలో లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇంత వేగంగా అంత పెద్ద పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అయితే మాత్రం అభిమానులు పండగ చేసుకోవచ్చు అనే చెప్పాలి.
#NTRNeel is entering its most explosive phase
Man of Masses @Tarak9999 steps into the destructive soil from April 22nd ❤️❤️#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm pic.twitter.com/z7hsCkhOY0
— Mythri Movie Makers (@MythriOfficial) April 9, 2025