RCB Vs DC 2025: ఐపీఎల్ గురించి ప్రస్తావనకు వస్తే.. బౌలర్లకు కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తాయి. ఫీల్డర్లకు వంటి నొప్పులు గుర్తుకు వస్తాయి. బ్యాటర్లకు మాత్రం మజా వస్తుంది. పరుగులు పెడుతున్న బంతిని చూస్తే ఊపు వస్తుంది. కానీ అప్పుడప్పుడు అలాంటి బ్యాటర్లకు కూడా చుక్కలు చూపిస్తారు కొంతమంది బౌలర్లు.
Also Read: సర్జరీ తో అందం పోగొట్టుకున్న సూపర్ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా..
గురువారం బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ (RCB vs DC) మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్ చూసి.. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు ఓపెనర్లు సొంత మైదానంలో దూకుడుగా ఆడారు. తొలి వికెట్ కు ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22), సాల్ట్ (37) తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో 3.5 ఓవర్లలోనే 61 రన్స్ పార్ట్నర్ షిప్ బిల్ట్ చేశారు.. కానీ ఈ దశలోనే బెంగళూరు ఆటగాళ్లు వెంట వెంటనే ఔటయ్యారు. సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ.. ఢిల్లీ బౌలర్ల ముందు తలవంచారు. పాటిదార్(25), టిమ్ డేవిడ్(37) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ కావడంతో బెంగళూరు భారీ స్కోరు చేయలేకపోయింది. పడిక్కల్(1), లివింగ్ స్టోన్ (4), జితేష్ శర్మ (3) దారుణంగా విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్లో ఎంతో విలువైన బెంగళూరు ఆటగాడు పడిక్కల్ వికెట్ ను ముఖేష్ కుమార్ పడగొట్టాడు. అద్భుతమైన బంతివేసి అవుట్ చేశాడు.. అయితే ఆ ఓవర్ ను ముఖేష్ కుమార్ మెయిడిన్ గా వేయడం విశేషం. మొత్తంగా మూడు ఓవర్లు వేసిన ముఖేష్ కుమార్.. 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ లో సాధారణంగా మేయిడిన్ చాలా కష్టం. బెంగళూరులోని చిన్నస్వామి పిచ్ పై మరింత కష్టం. కాని దానిని నిజం చేసి చూపించాడు.
ఎంతమంది వేశారంటే
ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో ముగ్గురు బౌలర్లు మెయిడిన్ ఓవర్లు వేసి.. వికెట్ కూడా సాధించారు. ఈ జాబితాలో రాజస్థాన్ బౌలర్ జోప్రా ఆర్చర్ మొదటి స్థానంలో ఉన్నాడు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు మెయిడిన్ ఓవర్ వేయడంతో పాటు.. ఒక వికెట్ కూడా సాధించాడు. వైభవ్ అరోరా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో
మెయిడిన్ ఓవర్ తో పాటు వికెట్ కూడా పడగొట్టాడు. ఇక బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బౌలర్ ముఖేష్ కుమార్ మెయిడిన్ ఓవర్ వేయడంతో పాటు వికెట్ సాధించాడు.
ఇదీ ముఖేష్ కుమార్ నేపథ్యం
ముఖేష్ కుమార్ 2015 -2016 అక్టోబర్ 30న రంజి ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో తన లిస్ట్ A లో అరంగేట్రం చేసాడు. ఇదే సంవత్సరంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో t20 టోర్నీలోకి ప్రవేశించాడు. 2002 సెప్టెంబర్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్లో భారత జాతీయ జట్టులోకి తొలిసారి అడుగుపెట్టాడు. 2022 డిసెంబర్లో శ్రీలంక జట్టుతో జరిగిన టి20 సిరీస్లో.. టీమిండియాలోకి ప్రవేశించాడు. 2023 జూన్ నెలలో వెస్టిండీస్ పర్యటన కోసం. జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 2023 జూలై 20న వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా అతడు జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. తొలి టెస్టులో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. 2023 జూలై 27న వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఐపీఎల్ లో 23 మ్యాచ్లు ఆడి.. 26 వికెట్లు పడగొట్టాడు.. ఇతడిని ఢిల్లీ జట్టు యాజమాన్యం 8 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read: 2026 లో పాన్ ఇండియా ను షేక్ చేయబోతున్న మన స్టార్ హీరోలు…