Spy Review : నిఖిల్ ‘స్పై’ మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం!

సెలెక్టివ్ మీడియా పర్సన్స్ మరియు సినీ ప్రముఖులకు వేసి చూపించారు. ఈ షో చూసిన తర్వాత వాళ్ళ నుండి ఆశించిన రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. టేకింగ్ విషయం లో డైరెక్టర్ కొన్ని పొరపాట్లు  చేసినట్టు టాక్. ఆ పొరపాట్లను సరి చేసుకునేందుకే హీరో నిఖిల్ నిర్మాత రాజశేఖర్ రెడ్డి ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చెయ్యాల్సిందిగా కోరాడని, కానీ నిర్మాత ఒప్పుకోకపోవడం నిఖిల్ గొడవపడ్డాడని ఇండస్ట్రీ లో ఒక వార్త జోరుగా ప్రచారమైన సంగతి తెలిసిందే. ఇది నిఖిల్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నాడు,

Written By: Vicky, Updated On : June 25, 2023 6:26 pm
Follow us on

Spy Review : విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలనే తపన ఉండే హీరో నిఖిల్ సిద్దార్థ్. ఈయన చేసిన ప్రతీ సినిమా కొత్త రకంగా ఉంటుంది. హిట్టైన ఫ్లాప్ అయినా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రం ఆయన సినిమాలు బాగా నచ్చుతాయి. ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా నిఖిల్, ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం తో ఆయనకీ టాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ కురిసింది.

కెరీర్ ప్రారంభం లో వరుసగా ఫ్లాప్స్ అందుకున్నప్పటికీ, ‘స్వామి రారా’ చిత్రం నుండి మాత్రం ఇతను చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ సక్సెస్ అవుతూ వచ్చింది. ఇక గత ఏడాది ఈయన హీరో గా నటించిన ‘కార్తికేయ 2 ‘ చిత్రం టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ సృష్టించింది, ఇప్పుడు ఆయన స్పై అనే చిత్రం తో మరోసారి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడానికి సిద్ధం అయ్యాడు.

ఈ చిత్రం ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రివ్యూ షో ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సెలెక్టివ్ మీడియా పర్సన్స్ మరియు సినీ ప్రముఖులకు వేసి చూపించారు. ఈ షో చూసిన తర్వాత వాళ్ళ నుండి ఆశించిన రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కానీ, పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త.  సినిమా కాన్సెప్ట్ సరికొత్త గా ఉన్నప్పటికీ టేకింగ్ విషయం లో డైరెక్టర్ కొన్ని పొరపాట్లు  చేసినట్టు టాక్.

ఆ పొరపాట్లను సరి చేసుకునేందుకే హీరో నిఖిల్ నిర్మాత రాజశేఖర్ రెడ్డి ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చెయ్యాల్సిందిగా కోరాడని, కానీ నిర్మాత ఒప్పుకోకపోవడం నిఖిల్ గొడవపడ్డాడని ఇండస్ట్రీ లో ఒక వార్త జోరుగా ప్రచారమైన సంగతి తెలిసిందే. ఇది నిఖిల్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నాడు, మరి ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.