Nikhil sensational comments on Anasuya: టీవీ సీరియల్స్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై, ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8 Telugu) కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకొని, టైటిల్ విన్నర్ గా నిల్చిన నిఖిల్(Nikhil Maliyakkal) ప్రస్తుతం ‘కిరాక్ బాయ్స్..కిలాడి గర్ల్స్'(Kiraak Boys..Khiladi Girls) సీజన్ 2 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ వారం ప్రీ ఫినాలే ఎపిసోడ్స్, ఆ తర్వాతి వారం లో ఫినాలే ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రముఖ సీరియల్ నటి సోనియా సురేష్ తో కలిసి నిఖిల్ రీసెంట్ గానే ‘అమ్ములు’ అనే ప్రైవేట్ సాంగ్ చేసాడు. ఈ పాట విడుదల సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
సాధారణంగా ఏ పాట ని అయినా చిత్రీకరించడానికి కనీసం నాలుగు రోజుల సమయం తీసుకుంటారు. కానీ ఈ పాటను కేవలం ఒకే ఒక్క రోజులో చిత్రీకరించారట. హీరోయిన్ డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు నిఖిల్. కేవలం ఒక్క రోజులోనే షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఈ పాటలో నిఖిల్ డ్యాన్స్ స్టెప్స్ అదరగొట్టేసాడు. సోషల్ మీడియా లో అవి బాగా వైరల్ అయ్యాయి. ఒక్క రోజు షూటింగ్ తో ఈ రేంజ్ ఔట్పుట్ ని ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. యూట్యూబ్ లో అప్లోడ్ అయిన మూడు రోజులకే ఈ పాటకు ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. నిఖిల్ కి ఇదే మొట్టమొదటి ప్రైవేట్ ఆల్బం పాట అట. ఇదంతా పక్కన పెడితే ‘కిరాక్ బాయ్స్..కిలాడి గర్ల్స్’ ప్రోగ్రాం లోని ఒక ఎపిసోడ్ లో నిఖిల్, అనసూయ మధ్య ఒక్క చిన్నపాటి గొడవ జరుగుతుంది.
దీనిపై రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడుగుతూ ‘ప్రస్తుతం మీరు వీకెండ్ లో చేస్తున్న ప్రోగ్రాంలో అనసూయ గారు మగవాళ్ళని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు, అర్జున్ గారు తప్పు అంటూ వాదించారు. ఆరోజు మీ మధ్య చాలా హీట్ వాతావరణంలో వాదనలు జరిగాయి. ఇలాంటి వాదనలు అక్కడి పరిస్థితులను బట్టి నిజంగా జరుగుతాయా?, లేకపోతే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా?’ అని అడగ్గా, దానికి నిఖిల్ సమాధానం చెప్తూ ‘ అక్కడ జరిగే సంఘటనలకు అనుగుణంగా మీరే యూట్యూబ్ వీడియోస్ క్రింద రియాక్ట్ అవుతూ ఉంటారు, మేమెందుకు రియాక్ట్ అవ్వకుండా ఉంటాము,కచ్చితంగా అవుతాము, నాకు ఏదైనా తప్పు అనిపిస్తే తప్పు అని కచ్చితంగా చెప్పేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది, మీరు కూడా ఈ వీడియో ని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.
