ఈ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ మొదలై 9 వారాలు పూర్తి అయ్యింది. ఈ 9 వారాల్లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ గేమ్ ఆడుతూనే వచ్చారు. వారిలో ముఖ్యంగా భరణి గురించి చెప్పుకోవాలి. సేఫ్ గేమ్ ఆడడం వల్లే ఈయన ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు. మళ్లీ అదృష్టం కలిసి రావడంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫైర్ మీద గేమ్ ఆడుతాడు అని అందరూ అనుకుంటే, మళ్లీ అదే సేఫ్ గేమ్ మొదలు పెట్టాడు. అందుకే గత వారం డేంజర్ జోన్ వరకు మరోసారి రావాల్సింది, అందరికీ సహాయం చేసుకుంటూ వచ్చిన ఆయన, తనూజ ముందు చెయ్యి చాచి నన్ను ఎలిమినేషన్ నుండి సేవ్ చెయ్యి అని బ్రతిమిలాడే పరిస్థితి వచ్చాడు. ఇక నుండి ఆయన సేవ్ గేమ్ ఆడకూడదు అని నిర్ణయం తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఆయన దివ్య ని నామినేట్ చేసినట్టు తెలుస్తుంది.
కారణాలు ఏమిటి అనేది పూర్తిగా తెలియదు కానీ, నామినేషన్స్ సమయం లో వీళ్లిద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. భరణి నిజంగా గేమ్ ప్రారంభించి ఉండుంటే, కచ్చితంగా దివ్య తో ఈరోజుటి ఎపిసోడ్ నుండి రిలేషన్ కి బ్రేక్ వేసుకుంటాడు అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది. ఇక ఈ వారం భరణి తో పాటు నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే సంజన, దివ్య, రీతూ చౌదరి, నిఖిల్, గౌరవ్ వంటి వారు ఉన్నారు. నిన్న ప్రోమో ని చూస్తే భరణి ని ఇమ్మానుయేల్ నామినేట్ చేయగా, దివ్య ని రీతూ చౌదరి నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ నిఖిల్ ని నామినేట్ చేస్తాడు. ఈ నామినేషన్ ప్రక్రియ ని ప్రతీ కంటెస్టెంట్ కేవలం 5 నిమిషాల్లోనే పూర్తి చెయ్యాలి.
అందుకోసం టైమర్ ని కూడా ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. ఇక నామినేషన్స్ లోకి వచ్చిన లిస్ట్ ని బట్టి చూస్తే తనూజ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఆమెకు బాగా క్లోజ్ అయిన రీతూ చౌదరి, భరణి కి ఆమె ఓటింగ్ మొత్తం పడే అవకాశం ఉంది. ఇక డిమోన్ పవన్ కూడా నామినేషన్స్ లో లేకపోవడం తో అతని ఓటు బ్యాంక్ కూడా రీతూ చౌదరి కి పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం టాప్ లో ఉండే అవకాశాలు రీతూ చౌదరి కి ఎక్కువ ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో భరణి ఉంటాడు. నిన్నటి ఎపిసోడ్ ఆయనపై చాలా సానుభూతి ని కలిగేలా చేసింది. అంతే కాకుండా తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా ఇతనికి బలంగా పడొచ్చు. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో సంజన, నాల్గవ స్థానం లో గౌరవ్, ఐదవ స్థానం లో నిఖిల్, ఆరవ స్థానం లో దివ్య ఉన్నారు. ఈ వారం తనూజ, కళ్యాణ్ ఫ్యాన్స్ ఆపరేషన్ దివ్య అని సోషల్ మీడియా లో ఒక క్యాంపైన్ మొదలెట్టారు. ఆమెని ఎలా అయినా ఈ వారం ఇంటికి పంపేందుకే చూస్తున్నారు. చూడాలి మరి ఏమి అవ్వబోతుంది అనేది.