https://oktelugu.com/

YS Sharmila : షర్మిళ పార్టీ కాంగ్రెస్ లో విలీనానికి ఆ ఒక్కటే అడ్డంకి

విలీన ప్రక్రియలో ఇక్కడే ప్రతిష్ఠంభన ఏర్పడినట్టు సమాచారం. ప్రస్తుతం ఇదే వ్యవహారంలో డీకే శివకుమార్, కోమటిరెడ్డి అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో షర్మిళ సైతం ఢిల్లీబాట పట్టనున్నట్టు సమాచారం. అంటే అతిత్వరలో దీనిపై క్లారిటీ రానుందన్న మాట.

Written By: , Updated On : June 25, 2023 / 05:45 PM IST
Follow us on

YS Sharmila : కాంగ్రెస్ పార్టీలో షర్మిళ పార్టీ విలీనానికి అంతా రంగం సిద్ధమైంది. తెలంగాణలో వైఎస్సార్ టీపీ పార్టీ పెట్టినా ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. ఒక్కటంటే ఒక్క శాతం కూడా ఆశాభావం కనిపించడం లేదు. దీంతో షర్మిళ తన పార్టీని విలీనం చేయని అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే విలీన ప్రక్రియకు షర్మిళ సుముఖంగా ఉన్నా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఒక షరతు పెట్టింది. షర్మిళ కేవలం ఏపీకి పరిమితం కావాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా తాను తెలంగాణలో ఉంటానని.. అక్కడ నుంచి అసెంబ్లీకి పోటీచేస్తానని చెబుతున్నారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదు.
షర్మిళతో ఏపీలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్. జగన్ పుణ్యమా అని ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి షర్మిళను రంగంలోకి దించితే కొంత పాజిటివ్ ఓటు బ్యాంకును టర్న్ చేయవచ్చన్నది ప్లాన్. వాస్తవానికి ఈ లెక్కతోనే కర్నాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్ పెద్దలు వ్యూహరచన చేశారు. కానీ షర్మిళ మాత్రం తెలంగాణ అంటూ బెట్టు వీడడం లేదు. ఏపీ విషయంలో అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో తెలంగాణ నేతలు షర్మిళ తమకు అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
షర్మిళ పిలేరు నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని డిసైడయ్యారు. అక్కడే స్థిర నివాసం ఉండేందుకుగాను ఇంటిని సైతం కొనుగోలు చేశారు.  వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంతమాత్రం రుచించడం లేదు. ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా మిగతా నాయకులంతా వ్యతిరేకిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం నిర్మోహమాటంగా పెద్దలకు వద్దని చెబుతున్నారు. అటు హైకమాండ్ సైతం అస్సలు తెలంగాణలో షర్మిళకు ఏంపని అన్నట్టు ప్రశ్నించినట్టు తెలిసింది. విలీన ప్రక్రియలో ఇక్కడే ప్రతిష్ఠంభన ఏర్పడినట్టు సమాచారం. ప్రస్తుతం ఇదే వ్యవహారంలో డీకే శివకుమార్, కోమటిరెడ్డి అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో షర్మిళ సైతం ఢిల్లీబాట పట్టనున్నట్టు సమాచారం. అంటే అతిత్వరలో దీనిపై క్లారిటీ రానుందన్న మాట.