https://oktelugu.com/

Adipurush – Virender Sehwag : ‘ఆదిపురుష్’ సినిమాపై , ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్!

ఇప్పుడు రీసెంట్ గా ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా ఈ చిత్రం పై సంచలన  వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ 'ఆదిపురుష్ సినిమాని చూసిన తర్వాత నాకు అర్థం అయ్యింది..బాహుబలి కట్టప్ప ని ఎందుకు చంపాడో'  అంటూ చాలా వ్యంగ్యంగా ఒక కామెంట్ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : June 25, 2023 / 06:33 PM IST
    Follow us on

    Adipurush – Virender Sehwag : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు కానీ, ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో పేద ట్రోల్ మెటీరియల్ గా మారింది.

    రామాయణం ని 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీసినట్టుగా చెప్పుకొచ్చిన డైరెక్టర్ ఓం రౌత్ కనీసం 50 కోట్ల రూపాయిల క్వాలిటీ తో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదని. అంతే కాకుండా రామాయణం మొత్తాన్ని కామెడీ చేసి చూపించాడని, ఇది క్షమింహారాని పాపం అని, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటూ నార్త్ ఇండియా మొత్తం ఒక పెద్ద ఎత్తున హిందీ సంఘాల నుండి నిరసన జ్వాలలు రగిలాయి. థియేటర్స్ ని ద్వంసం కూడా చేసారు.

    అంతే కాదు కొంత మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఈ చిత్రం పై మండిపడుతున్నారు. మొన్నీమధ్యనే శక్తి మాన్ సీరియల్ ఫేమ్ ముకేశ్ ఖానా ఈ సినిమాని చూసి ‘ఆదిపురుష్ మూవీ టీం మొత్తాన్ని ఎండలో నిలబెట్టి తగలబెట్టాలి’ అని కామెంట్ చేసాడు. అది పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్ గా ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా ఈ చిత్రం పై సంచలన  వ్యాఖ్యలు చేసాడు.

    ఆయన మాట్లాడుతూ ‘ఆదిపురుష్ సినిమాని చూసిన తర్వాత నాకు అర్థం అయ్యింది..బాహుబలి కట్టప్ప ని ఎందుకు చంపాడో’  అంటూ చాలా వ్యంగ్యంగా ఒక కామెంట్ చేసాడు. అది ఇప్పుడు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. సెహ్వాగ్ లాంటి క్రికెట్ దిగ్గజం ఇలాంటి కామెంట్స్ చెయ్యడం పై ప్రభాస్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కొంతమంది నెటిజెన్స్ ప్రభాస్ ని ఈ ట్వీట్ అడ్డం పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు.