Rajamouli: నీ స్థాయి వేరు… బంధుప్రీతి వదిలేయ్ రాజమౌళి!

Rajamouli: రంగం ఏదైనా బంధుప్రీతి సర్వసాధారణం. ప్రతిభతో సంబంధం లేకుండా మనవాడు అయితే చాలు అవకాశం ఇచ్చేద్దామనే జనాల తీరును, బంధుప్రీతి అనవచ్చు. సినిమా రంగంలో కూడా దీని ప్రభావం ఎక్కువే. దీని కారణంగా సినిమా క్వాలిటీ తగ్గిపోతుంది. రాజమౌళి లాంటి వరల్డ్ క్లాస్ దర్శకుడు కూడా దీనికి అతీతం కాదు. రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుండి దాదాపు ఒకే టీం ని కొనసాగిస్తున్నారు. కెమెరా మెన్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఇలా […]

Written By: Shiva, Updated On : December 4, 2021 2:21 pm
Follow us on

Rajamouli: రంగం ఏదైనా బంధుప్రీతి సర్వసాధారణం. ప్రతిభతో సంబంధం లేకుండా మనవాడు అయితే చాలు అవకాశం ఇచ్చేద్దామనే జనాల తీరును, బంధుప్రీతి అనవచ్చు. సినిమా రంగంలో కూడా దీని ప్రభావం ఎక్కువే. దీని కారణంగా సినిమా క్వాలిటీ తగ్గిపోతుంది. రాజమౌళి లాంటి వరల్డ్ క్లాస్ దర్శకుడు కూడా దీనికి అతీతం కాదు. రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుండి దాదాపు ఒకే టీం ని కొనసాగిస్తున్నారు. కెమెరా మెన్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక సినిమా అవుట్ ఫుట్ మంచిగా రావడంలో టీం మధ్య అవగాహన చాలా అవసరం.

Rajamouli

దాని కోసం రాజమౌళి తనకు అనుకూలమైన టీమ్ ని ఎంచుకోవడంలో తప్పులేదు. అయితే సినిమా బడ్జెట్, స్థాయి ఆధారంగా సాంకేతిక నిపుణులను మార్చడం అనేది చాలా అవసరం. సెంటిమెంట్ కోసమో, మనవాళ్ళు అనే ఫీలింగ్ తోనో వరల్డ్ క్లాస్ చిత్రాలకు కూడా లోకల్ సోర్స్ వాడుకోవడం సరైన పద్దతి కాదు. ఈ విషయంలో రాజమౌళి విమర్శలపాలు అవుతున్నా తన నిర్ణయం మార్చుకోవడం లేదు.

రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా కజిన్ ఎం ఎం కీరవాణి కొనసాగుతున్నారు. ఆయన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ నుండి ఆర్ ఆర్ ఆర్ వరకు… అన్ని చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. ఇక అపజయం ఎరగని రాజమౌళి జైత్రయాత్రలో కీరవాణి పాత్ర కూడా ఉంది. రాజమౌళి సన్నివేశాలకు కీరవాణి నేపధ్య సంగీతం ప్రాణం పోస్తుంది. కాగా బాహుబలి మూవీ మ్యూజిక్ విషయంలో కీరవాణి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన మ్యూజిక్ సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

Also Read: Chatrapathi: భీమిలీ బీచ్​లో ఛత్రపతి సందడి

బాహుబలి 1 తర్వాత కనీసం భాహుబలి 2 కోసం వేరే సంగీత దర్శకుడిని తీసుకోవాలని ఫ్యాన్స్ రాజమౌళికి విజ్ఞప్తులు పంపారు. అవేమి రాజమౌళి పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా అదే తరహా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీ నుండి విడుదలైన మూడు సాంగ్స్.. సినిమా స్థాయికి తగ్గట్లు లేవు అనేది సినీ ప్రియుల అభిప్రాయం. అలా అని కీరవాణి తక్కువ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు.

ఒక పాన్ ఇండియా చిత్రానికి కీరవాణి తరహా మ్యూజిక్ వలన నేటివ్ ప్రాబ్లం వస్తుంది. ఉదాహరణకు జనని సాంగ్ లో విజువల్స్ అద్భుతం.. ఆ సాంగ్ ట్యూన్స్ మాత్రం రాజమౌళి రేంజ్ ని అందుకోలేకపోయాయి. దీంతో ఇకనైనా రాజమౌళి బంధుప్రీతి వదిలేస్తే ఆయన స్థాయి మరో మెట్టు పైకి వెళ్తుందని కొందరు అంటున్నారు.

Also Read: Akhanda: బాలయ్య ‘అఖండ’ సినిమా చూస్తూ ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ మృతి

Tags