https://oktelugu.com/

Chatrapathi: భీమిలీ బీచ్​లో ఛత్రపతి సందడి

Chatrapathi: టాలీవుడ్​ దిగ్గజ దర్శకుడు రాజమౌళి హీరో ప్రభాస్​తో తెరక్కకించిన సినిమా ఛత్రపతి. తెలుగులో ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సినిమాను ప్రస్తుతం హిందీలో తెరకెక్కిస్తున్నారు. వివి వినాయక్​ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ హీరోగా నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా షూటింగ్ భీమిలీ బీచ్​లో మొదలైంది. ఈ సందర్బంగా చిత్రబృందం బీచ్​లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 11:56 AM IST
    Follow us on

    Chatrapathi: టాలీవుడ్​ దిగ్గజ దర్శకుడు రాజమౌళి హీరో ప్రభాస్​తో తెరక్కకించిన సినిమా ఛత్రపతి. తెలుగులో ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సినిమాను ప్రస్తుతం హిందీలో తెరకెక్కిస్తున్నారు. వివి వినాయక్​ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ హీరోగా నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా షూటింగ్ భీమిలీ బీచ్​లో మొదలైంది. ఈ సందర్బంగా చిత్రబృందం బీచ్​లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్​గా ముసరత్‌ బంచా నటిస్తుండగా.. హీరో తల్లిగా భాగ్యశ్రీ కనిపించనుంది.రత్‌ ఖేలేఖర్, రాజేష్‌శర్మ, రాంజేంద్ర గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమిలీలో డిసెంబర్‌ 10 వరకు షూటింగ్‌ జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు.

    Chatrapathi

    Also Read: జగన్ కు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. చంద్రబాబు భార్య కాళ్లు కన్నీళ్లతో కడుగుతాడట!

    ఈ షూటింగ్​లో దర్శకుడు వివి వినాయక్​ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక్​ తనకు మంచి మిత్రుడని తెలిపారు. స్వయం కృషితో గొప్ప డైరెక్టర్​గా సినీ ఇండస్ట్రీలో ఎదిగారని.. భీమిలీలో జరిగే ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్​ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హిందీలో ఆయనకు తొలి సినిమా కాగా.. మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశించారు.

    జైజానకి నాయక, సీత సినిమాలు పెద్దగా హిట్​ సాధించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన రాక్షసుడు సినిమా ప్రేక్షకులను అలరించింది. క్రైమ్ థ్రిల్లర్​ నేపథ్యంలో సాగిన ఈ సినిమా అందరినీ కట్టిపడేసింది. ఇటీవలే వచ్చిన అల్లుడు అదుర్స్​ కూడా ఎప్పటిలాగే ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు బాలీవుడ్​లో అయినా విజయం సాధిస్తాడేమో వేచి చూడాలి.

    Also Read: పేదలపైనే రుణం.. ఓటీఎస్ తో భారం