Sara Alikhan: అలా ఉండేవాడ్నే పెళ్లిచేసుకుంటానంటున్న సారా

Sara Alikhan: బాలీవుడ్ హీరోయన్​ సారా అలీఖాన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా.. అతి తక్కువ కాలంలో అటు బాలీవుడ్​తో పాటు టాలీవుడ్​లోనూ మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ను దక్కించుకుంది. వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. మరోవైపు సోషల్​ మీడియాలోనూ భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉన్న బ్యూటీ సారా అలీఖాన్​. ఆమె నటనతో పాటు, వెయిట్ లాస్​, అందానికి సంబంధించిన పోస్టులతో కుర్రకారును కవ్విస్తూ.. మంచి ఫాలోవర్స్​ను దక్కించుకుంది. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 4, 2021 6:30 pm
Follow us on

Sara Alikhan: బాలీవుడ్ హీరోయన్​ సారా అలీఖాన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా.. అతి తక్కువ కాలంలో అటు బాలీవుడ్​తో పాటు టాలీవుడ్​లోనూ మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ను దక్కించుకుంది. వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. మరోవైపు సోషల్​ మీడియాలోనూ భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉన్న బ్యూటీ సారా అలీఖాన్​. ఆమె నటనతో పాటు, వెయిట్ లాస్​, అందానికి సంబంధించిన పోస్టులతో కుర్రకారును కవ్విస్తూ.. మంచి ఫాలోవర్స్​ను దక్కించుకుంది.

sara-ali-khan-will-get-married-on-one-condition

ప్రస్సుతం థనుష్​, అక్షయ్​ కుమార్​లతో కలిసి ఆంత్రంగి రే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటి. ఈ సినిమ్ ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి మనసులో మాటను బయట పెట్టింది సారా. ఈ క్రమంలోనే తను చేసుకోబోయే వాడు ఎలా ఉండాలో వివరించింది.

Also Read: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్…

తనకు కాబోయే భర్త తనను తన తల్లి నుంచి దూరం చేయొద్దని, ఆమెతో కలిసి జీవించడానికి ఒప్పుకోవాలని కోరింది. తన తల్లిని ఒంటరిగా వదలనని క్లియర్​గా చెప్పేసింది సారా. తల్లి, కూతురు కలిసి తరచుగా వెకేషన్ ను ఎంజాయ్ చేస్తారు.ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

కాగా, అంత్రంగి రే సినిమాకు ఆనందర్ ఎల్​రాయ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సారా బీహారీ అమ్మాయిగా నటించనుంది. ధనుష్​, అక్షయ్​కుమార్​ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైయాంగిల్ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినమా సాగనుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను భూషణ్ కుమార్ టి-సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

Also Read: ఈ దాడితో నైనా ‘కంగనా’లో మార్పు వస్తోందా