Nani : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరో గా సక్సెస్ అవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదనే సంగతి మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న పోటీ వాతావరణం లో కొత్తవాళ్లు మనుగడ సాగించడం కత్తి మీద సాము లాంటిది. స్టార్ హీరోల వారసులే ఫెయిల్ అవుతున్న ఈ కాలంలో, ఒక మధ్య తరగతి కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి వచ్చి, రేడియో జాకీ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి, ఎంతోమంది ప్రముఖ డైరెక్టర్స్ దగ్గర పని చేసి, ఆ తర్వాత ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా హీరో గా ప్రయాణం ని మొదలు పెట్టి, నేడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు నాని(Natural Star Nani). ఇప్పుడు నాని అనేది కేవలం ఒక హీరో పేరు కాదు, ఒక బ్రాండ్.
Also Read: ‘హిట్ 3’ గురించి రామ్ చరణ్ సెన్సేషనల్ కామెంట్స్..హీరో నాని కౌంటర్ వైరల్!
ఆ బ్రాండ్ కేవలం ఆయన హీరో గా చేసే సినిమాలకు మాత్రమే కాదు, నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ గా నిల్చిన ‘కోర్ట్’ చిత్రం అందుకు నిదర్శనం. ఈ సినిమా విడుదలైన నెల రోజులకే, ఆ నిర్మాతగా, హీరో గా డ్యూయల్ రోల్ చేసిన ‘హిట్ 3’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చి భారీ వసూళ్లతో థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం తర్వాత ఆయన దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వచ్చే ఏడాది మార్చ్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదంతా పక్కన పెడితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నాని అసలు పేరు నాని కాదు, నవీన్ బాబు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్టైలిష్ గా ఉండడం కోసం తన పేరు ని అలా మార్చుకున్నాడు. ఇప్పుడు చాలా పెద్ద రేంజ్ కి వెళ్ళిపోయాడు కాబట్టి తన స్క్రీన్ నేమ్ ని మరోసారి మార్చాలి అనే ఆలోచనలో ఉన్నాడట నాని. ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఇచ్చిన సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇంతకు ఆయన ఏ పేరుతో మార్చుకోవాలి అనుకుంటున్నాడో చూడాలి. నాని అనే పేరుతోనే నేడు ఆయన ఇంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అలాంటి పేరు ని మారిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందేమో అని అభిమానులు కొంతమంది ఫీల్ అవుతున్నారు. చూడాలి మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో అనేది భవిష్యత్తులో.
Also Read : ఆ విషయంలో రాజమౌళికి పోటీ ఇస్తున్న నాని, ఇది కదా హీరోకి కావాల్సింది!