Samantha : సౌత్ స్టేట్స్ లో మంచి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత(Samantha Ruth Prabhu) పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక హీరోయిన్ కి స్టార్ స్టేటస్ రావడానికి కనీసం నాలుగైదు సినిమాల సమయం పట్టేది. కానీ ఈమె మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత రెండవ సినిమా ఎన్టీఆర్ తో, మూడవ సినిమా మహేష్ బాబు తో, నాల్గవ సినిమా పవన్ కళ్యాణ్ తో ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ కళ్ళు చెదిరే ఇండస్ట్రీ హిట్స్ ని అందుకుంది. అందం పరంగా మాత్రమే కాదు, నటిగా కూడా ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం వల్లే ఇంతటి క్రేజ్ , ఫాలోయింగ్ ఏర్పడిందని ఆమె అభిమానులు అంటూ ఉంటారు.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
అయితే రీసెంట్ గానే సమంత పుట్టినరోజు కి కానుకగా, బాపట్ల ప్రాంతానికి చెందిన ఒక వీరాభిమాని, సమంత కి గుడి కట్టిన ఘటన సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం రేపిందో మనమంతా చూసాము. దీని పై సమంత రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ వార్త తెలియగానే నేను ఎంతో సంతోషించాను, అతను నాపై చూపిన అభిమానానికి నా కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి. కానీ నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించను. నా పేరు మీద ఆకలి తో ఉన్న నలుగురికి అన్నం పెడితే ఎంతో సంతోషిస్తాను.’ అంటూ చెప్పుకొచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గుడి కట్టి మూడేళ్లు అయ్యిందట. ప్రతీ రోజు సమంత పుట్టినరోజున ఈ గుడి వద్ద అన్నదాన కార్యక్రమాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలు చేస్తుంటాడట. ఈ విషయం సమంత కి తెలిసినట్టు లేదు, తెలిసి ఉంటే కచ్చితంగా అతన్ని తన వద్దకు రప్పించుకుందేమో.
అయితే సమంత ఇన్ని రోజులు మనల్ని హీరోయిన్ గా ఎంతలా అలరించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనారోగ్యానికి గురైన తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఏడాది పాటు కెమెరా కి దూరం గా ఉంటూ వస్తున్న సమంత, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా మారింది. అలా ఆమె నిర్మాతగా మారి నిర్మించిన ‘శుభమ్'(Subham Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగున్నాయి. హీరోయిన్ గా ఎంతో సక్సెస్ ని చూసిన సమంత, ఇప్పుడు నిర్మాతగా తొలి సక్సెస్ ని చూసింది, భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలను చూస్తుంది అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత