Nani: క్లాప్ అసిస్టెంట్ నుండి స్టార్ గా ఎదిగిన నాని ప్రయాణం అద్భుతం అని చెప్పాలి. కేవలం హార్డ్ వర్క్ తో ఆయన ఈ స్థాయికి వచ్చాడు. అష్టా చెమ్మా మూవీతో హీరోగా మారిన నాని.. మొదటి చిత్రంతోనే విజయం అందుకున్నాడు. అలా మొదలైంది, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ ఆయన్ని హీరోగా నిలబెట్టాయి. రాజమౌళి దృష్టిలో పడిన నానికి ఈగ మూవీలో ఛాన్స్ దక్కింది. ఆ మూవీలో ఆయన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కెరీర్ పరంగా ప్లస్ అయ్యింది. ఒక దశలో వరుస పరాజయాలు చూసిన నాని తిరిగి నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం హిట్ మీద హిట్ కొడుతూ టైర్ వన్ హీరో పొజీషన్ పై కన్నేశాడు.
Also Read: ‘హిట్ 3’ గురించి రామ్ చరణ్ సెన్సేషనల్ కామెంట్స్..హీరో నాని కౌంటర్ వైరల్!
అటు నిర్మాతగా కూడా ఆయన ప్రయాణం విజయపథంలో సాగుతుంది. కొత్త దర్శకులకు, నటులకు తన బ్యానర్ ద్వారా అవకాశాలు ఇస్తూ, అదే సమయంలో విజయాలు అందుకుంటున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో తెరకెక్కిన కోర్ట్ మూవీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఒక స్మాల్ బడ్జెట్ మూవీ రూ. 50 కోట్లకు పైగా రాబట్టడం విశేషం. నాని లేటెస్ట్ మూవీ హిట్ 3. దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీ మూడు రోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ చేరుకుంది. దాదాపు బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది.
హిట్ 3 సైతం నాని నిర్మించారు. అయితే హిట్ 3 మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ భారీ ఓపెనింగ్స్ దక్కయి. అందుకు కారణం నాని హార్డ్ వర్క్. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆయన హిట్ 3 కోసం చాలా కష్టపడ్డారు. ఒక సినిమాకు ప్రమోషన్స్ ఎంత అవసరమో తెలియజేశారు. సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళి మాస్టర్. ఆయన బాహుబలి సిరీస్ ని ప్రమోట్ చేసిన తీరు మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. దాన్నో పాఠంగా విద్యార్థులు చదువుకున్నారు.
నాని సైతం మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని హిట్ 3 సక్సెస్ తో అర్థం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళికి ఆయన పోటీ ఇస్తున్నాడు. నాని నిర్విరామంగా హిట్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. పలు నగరాలు సందర్శించాడు. అన్ని మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో ప్రమోట్ చేశాడు. మూవీ విడుదలయ్యాక కూడా ఆయన రిలాక్స్ కాలేదు. తన సినిమాలకు మార్కెట్ ఉన్న యూఎస్ లో వసూళ్లు పెంచేందుకు డల్లాస్ వెళ్ళాడు. యూఎస్ లో హిట్ 3 భారీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. సినిమా చేశామా? రిలాక్స్ అయ్యామా? అని ప్రమోషన్స్ ని తేలికగా తీసుకునే హీరోలు, నాని ని చూసి నేర్చుకోవాల్సి ఉంది.