spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Balakrishna : మెగాస్టార్ చిరంజీవి దెబ్బకి వెనకడుగు వేసిన నందమూరి బాలకృష్ణ..షాక్ లో ఫాన్స్

Chiranjeevi Balakrishna : మెగాస్టార్ చిరంజీవి దెబ్బకి వెనకడుగు వేసిన నందమూరి బాలకృష్ణ..షాక్ లో ఫాన్స్

Nandamuri Balakrishna backed away from Chiranjeevi : ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పోరు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలందరూ సంక్రాంతి డేట్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు..ఇక పెద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ హీట్ వాతావరణం ఉంటుందో ఊహించుకోవచ్చు..గతం లో రామ్ చరణ్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి సంక్రాంతి సీసన్ లో ఒక రోజు గ్యాప్ తో విడుదలయ్యేవి..సూపర్ హిట్ అయ్యాయి కూడా..ఇక వచ్చే సంక్రాంతి కి కూడా పెద్ద హీరోల సినిమాలు విడుదల అవ్వడానికి క్యూ కడుతున్నాయి.

ఈసారి సంక్రాంతి బరిలో ప్రభాస్ ఆదిపురుష్..మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య , నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి మరియు అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి..ఈ నాలుగు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో విడుదలవ్వనున్నాయి..అయితే వీటిల్లో ఎదో ఒకటి కచ్చితంగా తప్పుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి మరియు బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి, రెండిటికి కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు వ్యవహరిస్తున్నారు..ఇలా ఒక నిర్మాణ సంస్థ నుండి రెండు సినిమాలు క్లాష్ అవ్వడం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు..అలా మొట్టమొదటిసారి జరగబోతుండడం తో డిస్ట్రిబ్యూటర్స్ ‘మా వల్ల కాదు..మేము థియేటర్స్ సర్దుబాటు చెయ్యలేం..ఎదో ఒక మూవీ ని తప్పించండి’ అంటూ మైత్రి మూవీ మేకర్స్ మీద ఒత్తిడి చేస్తున్నారట..మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడం తో ఆ సినిమానే విడుదల చెయ్యమని పట్టుబడుతున్నారట.

ఈ విషయం ని మైత్రి మూవీస్ అధినేత నవీన్ గారు ఇదే విషయాన్నీ బాలయ్య దృష్టికి తీసుకొని రాగా, తప్పనిసరి పరిస్థితి అయితే వాయిదా వేసుకోండి..మరో మంచి డేట్ లో సినిమా రిలీజ్ చేసుకుందాం అంటూ ఆ చిత్ర డైరెక్టర్ గోపీచంద్ మలినేని చెప్పాడట బాలయ్య బాబు..దీనితో మైత్రి మూవీ మేకర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు సమాచారం..అయితే ఈ రెండు సినిమాలలో సంక్రాంతి కి మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య సినిమా రావడం మాత్రం ఖరారు అయ్యింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version