Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో చిరంజీవి కీలక పాత్ర వహించాడు. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీని పడుతూ ఎక్కడ తగ్గకుండా డిఫరెంట్ ప్రయత్నాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. నిజానికి చిరంజీవి లాంటి నటుడు ఈ మధ్యకాలంలో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. 400 కోట్ల క్లబ్లో చేరిపోయాడు ఇక వచ్చే ఏడాది సైతం సంక్రాంతి బరిలో నిలవాలనే ప్రయత్నం చేసినప్పటికి అది అనుకున్న మేరకు వర్కౌట్ అయ్యే విధంగా కనిపించడం లేదు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో ఆయన సంక్రాంతి బరిలో నిలవాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
కానీ ఈ మూవీ సంక్రాంతికి వచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది. బాబీ సైతం ఈ సినిమా సంక్రాంతికి రాదని చెబుతున్నాడట. కానీ చిరంజీవి మాత్రం నీ సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేయి సంక్రాంతికి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించు ఒకవేళ వర్కౌట్ కాకపోతే అప్పుడు చూద్దామని చెబుతున్నారట.
చిరంజీవి సైతం బాబీకి తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. బాబి ఈ సినిమాని ఏ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది… ఈ మూవీతో సైతం మరోసారి చిరంజీవి తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు. బాబీ సైతం ఈ మూవీతో చిరంజీవి ని 500 కోట్ల క్లబ్లో చేర్చడానికి తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు…

