Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , రెగ్యులర్ షోస్ నుండి కాస్త డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడం తో , ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా కేవలం ప్రీమియర్ షోస్ నుండే 3 కోట్ల 13 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు , గతం లో కిరణ్ అబ్బవరం మొదటి రోజు వసూళ్లు కూడా ఇంత ఉండేవి కాదు. అలాంటిది కేవలం ప్రీమియర్ షోస్ నుండి 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అంటే సెన్సేషనల్ ఓపెనింగ్స్ అనే చెప్పొచ్చు.
ఇక మొదటి రోజు (నేడు) ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ నుండి గంటకు 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున 5 నుండి 6 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఓవరాల్ గా ప్రీమియర్స్ + మొదటి రోజు కి కలిపి ఈ చిత్రానికి 9 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంటే షేర్ వసూళ్లు దాదాపుగా 4 నుండి 5 కోట్ల రూపాయిల మధ్యలో ఉండొచ్చు. విడుదలకు ముందు ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
నేడు వచ్చినట్టే , రేపు , ఎల్లుండి కూడా కలెక్షన్స్ వస్తే కచ్చితంగా ఈ సినిమా వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నిన్న విడుదలైన విజయ్ ‘జన నాయకుడు’ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడం తో , ఈ సినిమాకు అద్భుతంగా కలిసొచ్చింది అనే చెప్పాలి. అందుకే టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ , కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు కిరణ్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టిన చిత్రం ‘క’. ఈ రికార్డు ని ‘చెన్నై లవ్ స్టోరీ’ బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.



