spot_img
Homeఎంటర్టైన్మెంట్Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల పైనే ఉంటాయి. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో , జబర్దస్త్ లో అత్యధిక రెమ్యూనరేషన్ ని అందుకునే కమెడియన్స్ లో ఒకరిగా నరేష్ కి మంచి పేరుంది. హైపర్ ఆది , బులెట్ భాస్కర్ , సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను ఇలా ఎంతో మంది స్టార్ కమెడియన్స్ తో కలిసి బ్లాక్ బస్టర్ స్కిట్స్ చేశారు. అయితే రీసెంట్ గా బులెట్ భాస్కర్ నరేష్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమేనేమో అని చాలా మంది అనుకున్నారు , ప్రత్యేక కథనాలు కూడా మీడియా లో ప్రసారం చేశారు.

అయితే రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నరేష్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ అసలు ఏమైందంటే ఒకసారి బుల్లితెర భాస్కర్ నరేష్ పై పంచులు వేస్తూ ‘నరేష్ ని పిలిస్తే డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడికి రాడు . చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోతే బైక్ లో పెట్రోల్ కొట్టేస్తేనే వస్తానని అంటాడు, అలాంటి రకం’ అంటూ చెప్పుకొస్తాడు. ఈ పంచ్ బాగా వైరల్ అవ్వడం తో , యాంకర్ ఈ విషయాన్ని ఇంటర్వ్యూ లో ప్రస్తావించగా, నరేష్ అందుకు సమాధానం చెప్తూ ‘ఈ వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. భాస్కర్ ఎదో సరదాగా అన్నారు. అయినప్పటికీ కొందరు ఈ వ్యకాయలను ఆధారంగా చేసుకొని నా పై వీడియోలు చేసి నన్ను డబ్బు మనిషి లాగా జనాల ముందు పెట్టారు’ అంటూ జబర్దస్త్ నరేష్ ఆవేదన వ్యక్తం చేసాడు.

బులెట్ భాస్కర్ తనకు గురువు లాంటి వాడని , ఆయన నా గురించి ఎన్ని మాటలు చెప్పినా, నేను ఆయన్ని ఏమి అన్నానని నరేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. భాస్కర్ చాలా సరదా మనిషి అని , ఆయన మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు నరేష్. అయితే తానూ ఎన్నడూ కూడా హైపర్ ఆది , భాస్కర్ లపై బహిరంగంగా సరదాకి కూడా ఇలాంటి మాటలు మాట్లాడానని , కానీ వాళ్ళు మాత్రం ఎల్లప్పుడూ తన పై ఇలాంటి నెగెటివ్ జోక్స్ వేస్తూనే ఉంటారని , తల్చుకుంటే నేను కూడా వాళ్ళ లాగా చెప్పొచ్చని , వాళ్ళ రహస్యాలు నాకు ఎక్కువ తెలుసు , నన్ను రెచ్చగొడితే అవి బయట పెడుతా అంటూ సరదాగా నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు నరేష్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version