Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్ థియేట్రికల్ రైట్స్ ఒక వరం లాగా మారింది. పెట్టిన బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ నుండే లాగేవారు. కానీ క్రమంగా ఓటీటీ సంస్థలకు లాభాలు పడిపోయాయి. దీంతో ఈమధ్య కాలం లో నాన్ థియేట్రికల్ రైట్స్ అంత తేలికగా అమ్ముడుపోవడం లేదు. సినిమా లో విషయం ఉందని నమ్మితేనే కొంటున్నారు. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి సూపర్ స్టార్స్ సినిమాల వరకు ప్రతీ ఒక్కరిదీ ఇదే పరిస్థితి. ఇలాంటి సమయం లో వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది అంటే నమ్ముతారా?.
కానీ నిజంగానే అది వాస్తవ రూపం దాల్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రషస్ ని రీసెంట్ గానే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ చూసిందట. వాళ్లకు తెగ నచ్చడం తో మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారట. ఓటీటీ తో పాటు , ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకొని ఈ చిత్రం 26 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమాల ట్రాక్ రికార్డు ని చూసి కూడా ఈ రేంజ్ డబ్బులు పెట్టి కొన్నారంటే కచ్చితంగా ఈ సినిమాలో ఎదో విషయం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రం కోసం నిర్మాతలు 38 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. థియేటర్స్ నుండి కేవలం 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే చాలు , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది ఈ చిత్రం.
రీసెంట్ గానే విడుదల చేసిన టీజర్ ని చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమాతో వరుణ్ తేజ్ భారీ కం బ్యాక్ ఇస్తాడని తెలుస్తోంది. అదే కనుక జరిగితే , కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 12 కోట్ల షేర్ వసూళ్లను రాబడుతుంది. అప్పుడు నిర్మాతలకు , బయ్యర్స్ కి మరో లాటరీ తగిలినట్టే. ‘పెద్ది’ నుండి విడుదల అవుతున్న ప్రతీ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేడు విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సక్సెస్ జర్నీ ని వరుణ్ తేజ్ ముందుకు తీసుకెళ్తాడో లేదో చూడాలి.



